Friday, November 25, 2011

ఆదర్శకుటుంబం--1969

ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

పల్లవి::

కాళ్ళ గజ్జె కంకాలమ్మ..వేగుచుక్క వెలగామొగ్గ
ముత్యం బియ్యం మునగాచారూ..
కాళ్ళగజ్జె కంకాలమ్మా..వేగుచుక్కా వెలగామొగ్గా
ముత్యాల్లాంటి పిల్లలు మీరు
కూడదు కూడదు మీలో పోరు
చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌..చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌
చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌..చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌
చేతులు కలిపి ఆడండి..అహా
మనసులు కలిపి మసలండి..మ్మ్ హు..

కాళ్ళగజ్జె కంకాలమ్మా..వేగుచుక్కా వెలగామొగ్గా
ముత్యాల్లాంటి పిల్లలు మీరు
కూడదు కూడదు మీలో పోరు

చరణం::1

చిలిపితనము విడు పెదబాబు
అలుకవలదు యిక చినపాప
చిలిపితనము విడు పెదబాబు
అలుకవలదు యిక చినపాప
కిత కిత కిల కిల..కిత కిత కిల కిల
పలకా బలపం వలెనే జతగా
పప్పూ బెల్లం వలెనే తియ్యగా..ఉంటాం
ఉంటాం..ఉంటాం..టాం టాం టాం

కాళ్ళగజ్జె కంకాలమ్మా..వేగుచుక్కా వెలగామొగ్గా
ముత్యాల్లాంటి పిల్లలు మీరు
కూడదు కూడదు మీలో పోరు|

చరణం::2

పాలకుండలు పసిహృదయాలు..ఉప్పురాళ్ళూ మీ కీచులాటలు
పాలకుండలు పసిహృదయాలు..ఉప్పురాళ్ళూ మీ కీచులాటలు
పాలు విరిగినా..మనసు చెదిరినా..పాలు విరిగినా..మనసు చెదిరినా
పనికి రాదురా చిట్టిపాపలు..లో లో లో లో లో లో లో

కాళ్ళగజ్జె కంకాలమ్మా..వేగుచుక్కా వెలగామొగ్గా
ముత్యాల్లాంటి పిల్లలు మీరు
కూడదు కూడదు మీలో పోరు

చరణం::3

ముదిరిన మొక్కలు మారవు..మొలకలె చక్కగ పెరగాలి
ముదిరిన మొక్కలు మారవు..మొలకలె చక్కగ పెరగాలి
ముందరి కాలం మీదే మీదే..అందం ఆశలు మీమీదే

ఆశ మామీద...దోశ పొయిమీద
దాదాదాదా య ర ల వ శ ష స హ

కాళ్ళగజ్జె కంకాలమ్మా..వేగుచుక్కా వెలగామొగ్గా
ముత్యాల్లాంటి పిల్లలు మీరు
కూడదు కూడదు మీలో పోరు
చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌..చిమ్‌ చిమ్‌ చిమ్‌ చిమ్‌

No comments: