ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన:: కొసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల
ఆమె:::హల్లో సారూ..ఓ దొరగారూ..తగ్గండి మీరూ
ఏమిటండీ..ఏమిటండీ యీ హుషారూ ?
హల్లో సారు..ఓ దొరగారూ..తగ్గండి మీరూ
ఏమిటండీ..ఏమిటండీ యీ హుషారూ ?
అతడు:::హల్లో లేడీ..ఓ మై జోడీ
ఆపండి వేడి..ఏమిటమ్మ..ఏమిటమ్మ..యీ హడావుడీ
కోరస్::లాలలాలలలలలాలలాలలలలలాలలలా
చరణం::1
ఆమె::చంద్రలోకం చేరు రోజులు..కాలమంతా మారిందీ
ఇది చంద్రలోకం చేరు రోజులు..కాలమంతా మారింది
మీ పప్పులుడకవు తెలియండీ
అతడు::ఆ..ఆడవాళ్ళు మొగవాళ్ళైనారా ?
ఏమి మారెను చెప్పండి..రామాయణమును విప్పండి
మీ రామాయణమును విప్పండి
ఆమె:::హల్లో సారు..ఓ దొరగారూ..తగ్గండి మీరూ
ఏమిటండీ..ఏమిటండీ యీ హుషారూ ?
అతడు:::హల్లో లేడీ..ఓ మై జోడీ
ఆపండి వేడి..ఏమిటమ్మ..ఏమిటమ్మ..యీ హడావుడీ
చరణం::2
ఆమె::ఆడది చెప్పులు తొడిగితె అప్పుడు
కూడదు పోపొమ్మన్నారూ..ఇప్పుడు గప్‌చిప్పైనారూ
అతడు::ఓహో..తప్పు తెలుసుకొని మడమ ఎత్తుగల బూట్లు
తొడగమంటున్నాము..బొక్కబోర్ల పడమన్నాము
అతడు:::హల్లో లేడీ..ఓ మై జోడీ
ఆపండి వేడి..ఏమిటమ్మ..ఏమిటమ్మ..యీ హడావుడీ
ఆమె:::హల్లో సారు..ఓ దొరగారూ..తగ్గండి మీరూ
ఏమిటండీ..ఏమిటండీ యీ హుషారూ ?
చరణం::3
ఆమె:::మగవాళ్ళను పల్టి కొట్టించి ఎలక్షన్లలో
గెలుస్తు వున్నాం అధికారమ్ము చలాయిస్తున్నాం
అతడు::బేష్..కొన్నాళ్ళు మేము పిల్లలగన్నం
ఇక మీపని..అనుకున్నారు..ఇంతటితో బ్రతికించారూ
మమ్మల్నింతటితో..బ్రతికించారూ
ఆమె:::హల్లో సారు..ఓ దొరగారూ..తగ్గండి మీరూ
ఏమిటండీ..ఏమిటండీ యీ హుషారూ ?
అతడు:::హల్లో లేడీ..ఓ మై జోడీ
ఆపండి వేడి..ఏమిటమ్మ..ఏమిటమ్మ..యీ హడావుడీ
No comments:
Post a Comment