చిమ్మటలోని మాంచి ఆణిముత్యం వినండి
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::సినారె
గానం::ఘంటసాల,P.సుశీల
అతడు::బిడియమేలా..ఓ చెలి
పిలిచె నిన్నే..కౌగిలి
మొదటరేయీ ఒదిగిపోయీ
మోము దాచేవెందుకో..ఎందుకో
ఆమె::హా..అదే..ఇదేదో..ఎందుకో
అతడు::బిడియమేలా..ఓ చెలి
పిలిచె నిన్నే..కౌగిలి
మొదటరేయీ ఒదిగిపోయీ
మోము దాచేవెందుకో..ఎందుకో
చరణం::1
ఆమె::కనులు ముకుళించెను..లోలోన
తనువు వికసించెను..పైపైన
కనులు ముకుళించెను..లోలోన
తనువు వికసించెను..పైపైన
పదమురాక..కదలలేకా
ఒదిగి ఉన్నాను ఈవేళ
ఒదిగి ఉన్నాను ఈవేళ
నిలువలేను..పిలువలేను
అతడు:::ఊ..హూ..
బిడియమేలా..ఓ చెలి
పిలిచె నిన్నే..కౌగిలి
మొదటరేయీ ఒదిగిపోయీ
మోము దాచేవెందుకో..ఎందుకో
చరణం::2
అతడు::శయ్యపై మల్లియలేమనెను
చాటుగా జాబిలి ఏమనెను
శయ్యపై మల్లియలేమనెను
చాటుగా జాబిలి ఏమనెను
కలల దారి చెలుని చేరి
కరిగిపోవేమి నీవనెను
కరిగిపోవేమి నీవనెను
మరులు పూచే..మనసు వీచే
ఆమె::ఊ..హూ..
బిడియమేలా..ఓ చెలి..మ్మ్
పిలిచె నిన్నే..కౌగిలి..మ్మ్ హు..
మొదటరేయీ..మ్మ్..ఒదిగిపోయీ..ఆ ఆ
మోము దాచేవెందుకో..ఎందుకో...
No comments:
Post a Comment