Friday, September 16, 2011

పొగరుబోతు--1976

పాట ఇక్కడ వినండి

సంగీతం::K.V.మహాదేవన్

రచన::Dr.C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు

సేదబావిలో సందరూడు..చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడు..తగని అల్లరి చేస్తున్నాడు
సేదబావిలో సందరూడు..చిలిపిగ మునకేస్తున్నాడు
ఈ మగువ మనసులో మరో చంద్రుడు..తగని అల్లరి చేస్తున్నాడు
చందురుని మునకలు నీటివరకేనా..!
అంగాడి అల్లరి అంతవరకేనా..అంతంతవరకేనా..!!

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

మైకం పెంచే మగువేమో..చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చే వెలుగేమో..ఎన్నో జన్మల వెలుగవుతుంది
మైకం పెంచే మగువేమో..చీకటిలా కమ్మేస్తుందీ
ఇల్లాలిచ్చే వెలుగేమో..ఎన్నో జన్మల వెలుగవుతుంది
వేసిన బంధం కాదంటావా?
వేసిన అందం..వలదంటావా..మరి ఏమంటావు??

కట్టుకొన్నా అదే చీర
పెట్టుకొన్నా అవే పూలు
ఇంతగ నిన్నే..వలచే నన్నే
ఎందుకలా..చూస్తావూ?
ఇంకా ఇంకా..ఉడికిస్తావు

No comments: