Tuesday, September 27, 2011

ఉయ్యాల జంపాల--1965




సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,సుశీల


అతడు::ఓ..హో..య్యా...
దాచిన దాగదు వలపు..ఇక
దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు..ఇక
దాగుడు మూతలు వలదు
చక్కనీ కోపమూ..చల్లనీ తాపమూ
చక్కనీ కోపమూ..చల్లనీ తాపమూ
ఎందుకు మనలో మనకు

ఆమె::దాచిన దాగదు వలపు..ఇక
దాగుడు మూతలు వలదు
అతడు::ఓ..హో..య్యా...
ఆమె::ఊ...య్యా..

అతడు::కనుచూపుల కమ్మని కులుకు
నను దోచుట మునుపే తెలుసు
కనుచూపుల కమ్మని కులుకు
నను దోచుట మునుపే తెలుసు

ఆమె::మనసంతా తనదైతే మరి చోరీ ఎందులకు

అతడు::పూసలో దారమై..
ఆమె::పూవులో తావినై..
అతడు::పూసలో దారమై..
ఆమె::పూవులో తావినై..
ఇద్దరు::కలిసెను మనసూ మనసూ..

ఇద్దరు::దాచిన దాగదు వలపు..ఇక
దాగుడు మూతలు వలదు
అతడు::ఓ..హో..య్యా...
ఆమె::ఊ...య్యా..

ఆమె::ఒక తీయనిమైకం కలిగే
నెర వెవ్వెల కన్నుల వెలిగే
ఒక తీయనిమైకం కలిగే
నెర వెవ్వెల కన్నుల వెలిగే

అతడు::కలలందు హృదయాలు
విను వీధులలో ఎగిరే

ఆమె:: ఇరువురూ..ఏకమై
అతడు::ఒక్కటే ప్రాణమై
ఆమె:: ఇరువురూ..ఏకమై
అతడు::ఒక్కటే ప్రాణమై
ఇద్దరు::ముచ్చటగొలపవలయు..

ఇద్దరు::దాచిన దాగదు వలపు..ఇక
దాగుడు మూతలు వలదు
దాచిన దాగదు వలపు
అతడు::అ..హహహా..
ఆమె::ఓ..హో హో..
ఇద్దరు::అ హహహా..ఓ హో హో..

No comments: