Tuesday, September 27, 2011

ఉయ్యాల జంపాల--1965




సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::సుశీల

ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే..నంటూ వియ్యమాడ వస్తాడూ
ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే నంటూ వియ్యమాడ వస్తాడూ

దోరవయసు చిన్నవాడు
దొర చదువులు చదివినవాడు
ఆ హా హా ఆ...
దోరవయసు చిన్నవాడు
దొర చదువులు చదివినవాడు
దోబూచులు ఆడే వలపు
దోచుకొని పోతాడు

ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే నంటూ వియ్యమాడ వస్తాడూ

కొంటెతనపు కుర్రవాడు
కోరమీసమున్నవాడు
ఆ హా హా ఆ...
కొంటెతనపు కుర్రవాడు
కోరమీసమున్నవాడు
చూపులలో ఊహలు చదివి
సొగసు కానుకిస్తాడు

ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే నంటూ వియ్యమాడ వస్తాడూ

కమ్మనైన వన్నెలవాడు
కలుపుగోరు మాటలవాడు
ఆ హా హా ఆ...
కమ్మనైన వన్నెలవాడు
కలుపుగోరు మాటలవాడు
కన్నెపిల్ల మదిలో నిలచి
కాపురమే వుంటాడు

ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే నంటూ వియ్యమాడ వస్తాడూ
ఉంగరాల జుట్టువాడు వూరించే కన్నులవాడు
ఒయ్యారివి నీవే నంటూ..వియ్యమాడ వస్తాడూ

No comments: