సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::సుశీల
పల్లవి:
నీలోన ఊగె నాలోన ఊగె
నీలోన ఊగె నాలోన ఊగె
చూడచక్కటి ఊయలొక్కటే
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
చరణం1:
ఊగి ఊగి పైకిపోయే ఊహలెన్నియో
ఆగి ఆగి భువికి దిగెను అందమెంతయో
ఊగి ఊగి పైకిపోయే ఊహలెన్నియో
ఆగి ఆగి భువికి దిగెను అందమెంతయో
మింటి చందమామకు కొంటె కలువ భామకు
మింటి చందమామకు కొంటె కలువ భామకు
ముడివేసి జతకూర్చె తూగుటుయ్యెల ఆ
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాలా
నీలోన ఊగె నాలోన ఊగె
చూడచక్కటి ఊయలొక్కటే
చరణం2:
మనసులోని భావాలకు రూపుకలిగెను
కనులలోని కోరికలకు కాంతి పెరిగెను
మనసులోని భావాలకు రూపుకలిగెను
కనులలోని కోరికలకు కాంతి పెరిగెను
బిడియపడే మనసుకు వెలుగుతున్న కనులకు
బిడియపడే మనసుకు వెలుగుతున్న కనులకు
తొలిప్రేమ తెలిపింది తూగుటుయ్యెల ఆ
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
నీలోన ఊగె నాలోన ఊగె
చూడచక్కటి ఊయలొక్కటే
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
No comments:
Post a Comment