సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
సింధుభైరవి::రాగం
ఏటిలోని కెరటాలు..ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఏటిలోని కెరటాలు..ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
సొంతవూరు అయినవారు అంతరాన వుందురోయ్
అంతరాన వుందురోయ్
ఏటిలోని కెరటాలు..ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలె అతుకునోయ్
జ్ఞాపకాలె అతుకునోయ్
ఏటిలోని కెరటాలు..ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
కనులనీరు చిందితే మనసు తేలికౌనులే
తనకూ తనవారికీ ఎడబాటే లేదులే.
ఎడబాటే లేదులే.
ఏటిలోని కెరటాలు..ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు .. ఎక్కడికీ పోదు
No comments:
Post a Comment