Wednesday, September 08, 2010

ఇదా లోకం--1973

సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
File Director::K.S. Prakash Rao
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

హా హా హా హా హా హా హా 
మనసా..ఆ..మనసా
ఎందుకు ఎందుకు ఎందుకు నవ్వావంటే
నువ్వేమని చెప్పేవు లోకులకు
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు 
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా
ఏడవలేక నవ్వావా..నీగోడు నవ్వులో దాచావా  
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు
మనసా..ఆ..నా మనసా 

చరణం::1

సీతను కోరెను నీచుడు..నా సీతను కోరెను నీచుడు
సాయపడెను మారీచుడు..తారుమారుగా కధమారిందా
కారుచీకటి కమ్మేస్తుందని చెప్పకపోతివే మనసా 
ఎంత ముప్పుతెస్తివే మనసా..చెప్పకపోతివే మనసా 
ఎంత ముప్పుతెస్తివే..మనసా

చరణం::2

ఆడది దేవతరూపం..ఆమె ఉసురే తీరనిశాపం
అమ్మా తల్లీ దాసోహం అమ్మా..దాసోహం
ఆడది దేవతరూపం..ఆమె ఉసురే తీరనిశాపం
చెంప ఎప్పుడు చెళ్ళుమన్నదో..ఓఓఓఓఓఓఓఓ 
కొంప అప్పుడే గుల్లవుతుందని 
తెలుపకపోతివే మనసా..ఇల్లు నిలుపకపోతివె మనసా
తెలుపకపోతివే మనసా ఇల్లు నిలుపకపోతివె మనసా
ఎందుకు నవ్వావంటే..నువ్వేమని చెప్పేవు లోకులకు
మనసా..ఆ..నా మనసా 

చరణం::3

గడ్డిని కతికే మనుషులు..కారా చివరకు పశువులు
గడ్డిని కతికే మనుషులు..కారా చివరకు పశువులు
చెరపకురా నువు చెడేవు అన్న..పరమరహస్యం మరువరాదని 
పెద్దలు చెప్పిరి మనసా..ఆ సుద్దులు మరిచావ్ మనసా

No comments: