Wednesday, September 08, 2010

ఇదా లోకం--1973




సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,జయదేవ్,B వసంత
తారాగణం::శోభన్‌బాబు, శారద,నాగభూషణం,చంద్ర మోహన్, జ్యోతిలక్ష్మి.సుమ.

పల్లవి::

ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా 
గంగిరెద్దులా తల ఆడించక..గమ్యం ఏదో చూపిస్తారా   
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా
గంగిరెద్దులా తల ఆడించక..గమ్యం ఏదో చూపిస్తారా   
ఉన్నమాట అంటాము..ఓహో..ఉలికి పడక వింటారా 

చరణం::1

బాబూ..ఇవిగో డిగ్రీలు..బయస్సీలూ..బియ్యేలు
యమ్మెస్సీలూ, యమ్మేలు
వేలకు వేలూ పోశాము..ఎన్నో యేళ్ళు బతికాము
ఈ పట్టాలకు తెలివే లేదా..ఆఆ..పట్టభద్రులకు విలువేలేదా..ఆఆ
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

చరణం::2

ఉడుకు రక్తము..ఉరకలు వేసే 
యువకుల్లారా..యువతుల్లారా 
కళాశాలలు వదలండి..కదన రంగమున దూకండి
కళాశాలలు వదలండి..కదన రంగమున దూకండి

భావి పౌరులు మీరేనండి..రాజకీయములు మాకొదలండి 
కాలం వ్యర్థం చేయొద్దండి..కళాశాలలకు వెళ్ళండి
కళాశాలలకు వెళ్ళండి

స్వార్థంకోసం విద్యార్థులను..వాడుకునే 
నాయకులారా..వినాయకులారా..వినాయకులారా
పదవులు మీకు కావాలా..చదువులు మాకు పోవాలా
పదవులు మీకు కావాలా..చదువులు మాకు పోవాలా
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

చరణం::3

బడి కట్టిస్తాం  గుడి కట్టిస్తాం..ఆసుపత్రులు పెట్టిస్తాం 
వందలు వేలూ చందాలిస్తే..ప్రజా సేవలు మేమే చేస్తాం
బడి కట్టిస్తాం  గుడి కట్టిస్తాం ప్రజా సంస్థలను వశపరచుకొని 
ప్రజల ధనాన్ని భోంచేస్తారా..బేవ్.. 
గద్దెలెక్కిన పెద్దలు మీరు..మే గమ్మత్తులు యిక సాగవులే
సాగవులే యిక సాగవులే..సాగవులే యిక సాగవులే
ఇదా లోకం..ఇదా లోకం..ఇదా..ఆఆ..లోకం

దేశం కోసం నాడూ నేడూ పోరాడింది విద్యార్థులే
పోరాడింది విద్యార్థులే
యువతీ యువకులు నడుము బిగించి 
అందరికంటే ముందుంటారు..ముందుంటారు 
ఇక అందరికంటే ముందుంటారు..ముందుంటారు

No comments: