Wednesday, September 08, 2010

గంగ-మంగ--1973






సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

గడసాని దొరసాని ఒడుపు చూడండి 
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ  

చరణం::1

అరెరెరె నడకంటె నడక కాదు 
చలాకి నడక..బల్ కిలాడి నడక 
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ 
అది వడిసెల రువ్వ 
ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా
వగలంటె వగలు కాదు వలపుల సెగలు 
చూపంటె చూపు కాదు మదనుడి తూపు 
ఆ నడక ఆ నవ్వు ఆ వగలు ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని  
ఒడుపు చూడండి..ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ  

చరణం::2

మాటలతోటే నన్ను..మురిపించకురా 
ఏమేమో పొగిడేసి..బులిపించకురా
మాటలతోటే నన్ను..మురిపించకురా 
ఏమేమో పొగిడేసి..బులిపించకురా
ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా
కవ్వించాలని నువ్వు..కలలు కనకురా 
కత్తితోటి చెలగాడి..చిత్తు గాకురా 
గడఎక్కి తాడెక్కి గంతేసి చిందేసి 
అందరు మెచ్చేలాగ ఆడీ చూపాలిరా 
గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని  
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని..ఈఈ..దొరసాని..ఈ      

చరణం::3

తళుకు బెళుకు చూపిస్తా..ఆ
గజ్జె ఘల్లు మనిపిస్తా..ఆ
తళుకు బెళుకు చూపిస్తే తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లు మనిపిస్తే..గిలగిల గిలగిలగిల లాడాలి
ఆ తళుకు ఆ బెళుకు ఆ బిగువు ఆ బింకం 
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ
గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి 
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి 
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 
గడసాని..ఈఈ..దొరసాని..ఈ   

No comments: