Wednesday, September 08, 2010

జగమే మాయ--1973




సంగీతం::సత్యం
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 

పల్లవి::

జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 

జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 
జగమే మాయ..మనిషే మాయ

చరణం::1

డబ్బులకోసం అడ్డమైనగడ్డి కరుస్తున్నారు..ఔను
న్యాయాన్ని గొయ్యితీసి పాతేస్తున్నారు..నిజం
డబ్బులకోసం అడ్డమైన గడ్డి..కరుస్తున్నారు
న్యాయాన్ని గొయ్యితీసి..పాతేస్తున్నారు 
రేయ్..ఈ మాయదారి పెద్ద మనుషులెక్కడున్నారు
మాయదారి పెద్ద మనుషులెక్కడున్నారు
చిత్రగుప్తుడి చిట్టాలో..కెక్కుతున్నారు..హ్హా 
తిప్పలు..తెచ్చుకుంటారు  
        
జగమే మాయ..మనిషే మాయ
చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్ 
జగమే మాయ..మనిషే మాయ

చరణం::2

తాగినోడు చచ్చినాసరే అబద్దమాడడు..ఆడడు 
తలక్రిందులైపోయినగాన..నిజాన్ని దాచడు..ఆ
తాగినోడు చచ్చినాసరే..అబద్ద..మాడడు..ఆ
తలక్రిందులైపోయినగాన..నిజాన్ని దాచడు
ఏయ్..నీ యవ్వ ఈ ఓబులయ్యతో..ఒకటి రెండు యేస్కుంటేను 
ఈ ఓబులయ్యతో ఒకటి..రెండు యేస్కుంటేను
లోనవున్న అసలురంగు..బైటకొచ్చేను
ఆయ్ బాబోయ్..మన ఆటకట్టేను..ఆ..ధూ          

జగమే మాయ..మనిషే మాయ
వీడు చెప్పేదంతా..మాయ
అరె..చెసేదంతా..మాయ
దేవుడైన ఈ మర్మం..చెప్పలేడు ఛాలెంజ్..హాక్ ధూ  

No comments: