Friday, September 10, 2010

మైనరు బాబు--1973




సంగీతం::T.చలపతిరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::S.P.బాలు,P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, S.V. రంగారావు

పల్లవి::

మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
ఆశలు పండీ ఆకలితీరి
బ్రతుకులు మారే పండుగరోజూ         
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

చరణం::1

గొప్ప గొప్పవాళ్ళ కెదురు నిలిచిన రోజూ
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజూ
గొప్ప గొప్పవాళ్ళ కెదురు నిలిచిన రోజూ
వాళ్ళ గొప్పతనం గంగలోన కలిపిన రోజూ
జబ్బ చరిచిన రోజు రొమ్ము విరిచిన రోజూ
మనం గెలిచినరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

చరణం::2

కూలి యజమాని తేడాలెవుండవు
ఈ కులాల ఈ మతాల గొడవ లుండవు
అందరిదొకటే మాట అందరిదొకటే బాట
అందరిదొకటే మాట..అందరిదొకటే బాట
ఇకపై చూడు బరాటా..ఆ..లలలా..ఆఆఆ
లలలా..ఆఆఆ..లలలలా..ఆఆఆ  

పనిచేస్తే అన్నానికి లోటు వుండదూ
సోమరిపోతులకు నిలువ నీడవుండదూ
పనిచేస్తే అన్నానికి లోటు వుండదూ
సోమరిపోతులకు నిలువ నీడవుండదూ
ఇది సామ్యవాదయుగం..ఇటే నడుస్తుంది జగం
ఇక ఆగదులే ఆగదులే..జగన్నాధ రథం..హోయ్...
             
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ
ఆశలు పండీ ఆకలితీరి
బ్రతుకులు మారే పండుగరోజూ
మనదే మనదేలే యీరోజూ
మన కందరికీ పండుగలే యీరోజూ

No comments: