సంగీతం::T.V.రాజు
రచన::దాశరధి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::N.T.రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి, చలం,చంద్రకళ
పల్లవి::
కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ముసి ముసి నవ్వులు..ఏమన్నవి?
ఆహా..కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ముసి ముసి నవ్వులు..ఏమన్నవి?
మన ఇరువురి..నొక్కటై పొమ్మనవీ
ఆహా..కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ఇరువురి..నొక్కటై పొమ్మనవీ
చరణం::1
మెరిసిన మేఘం..ఏమ్మనది ?
నీ నీలాల..కురులే నేనన్నది
ఆఆ..మెరిసిన మేఘం..ఏమ్మనది ?
నీ నీలాల..కురులే నేనన్నది
ఏమన్నది..ఇంకేమ్మనది ?
నీ దారి నా దారి..ఒకట్టన్నది
ఆహా..కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ఇరువురి..నొక్కటై పొమ్మనవీ
చరణం::2
అందాల హరివిల్లు..ఏమ్న్నది ?
నీ అందాలు..తన కంటె ఏమన్నది
ఓఓఓ..అందాల హరివిల్లు..ఏమ్న్నది ?
నీ అందాలు..తన కంటె ఏమన్నది
ఏమన్నది..ఇంకేమ్మనది ?
మోజైన ఈ రోజు..మన దన్నది
ఆహా..కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ఇరువురి..నొక్కటై పొమ్మనవీ
చరణం::3
బంగారు చామంతి..ఏమన్నది ?
నీ సింగారమునకే సలాం..అన్నది
ఆఆఆ..బంగారు చామంతి..ఏమన్నది ?
నీ సింగారమునకే సలాం..అన్నది
ఏమన్నది ? ఇంకేమన్నదీ ?
జగమంత మనకే..గులామన్నది
ఆహా..కలిసిన..కన్నులు ఏమన్నవి ?
మన ఇరువురి..నొక్కటై పొమ్మనవీ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment