Saturday, April 25, 2009

శ్రీనివాస కల్యాణం--1987

సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు,P.సుశీల

తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..
మగడు లేనివేళ తుమ్మెదా..వచ్చి మొగమాటంపెడతాడె తుమ్మెదా..
మాటవరసకంట తుమ్మెదా..పచ్చిమోటుసరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా..వచ్చి హత్తుకపోయాడె తుమ్మెదా
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..

ఎదురుపడితె తగలనీక దడికడతాడే
పొదచాటుకి పదపదమని సొదపెడతాడే..
ఎదురుపడితె తగలనీక దడికడతాడే
పొదచాటుకి పదపదమని సొదపెడతాడే..
ఒప్పనంటే ఒదలడమ్మా..ముప్పుతప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటే ఒదలడమ్మా..ముప్పుతప్పదంటె బెదరడమ్మా
చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టువిడుపులేనిదమ్మ క్రిష్ణుని పంతం..
మగడు లేనివేళ తుమ్మెదా..వచ్చి మొగమాటంపెడతాడె తుమ్మెదా..
మాటవరసకంట తుమ్మెదా..పచ్చిమోటుసరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానె తుమ్మెదా..వచ్చి హత్తుకపోయాడె తుమ్మెదా
తుమ్మెదా..ఓ..తుమ్మెదా..
ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా..తుమ్మెదా..తుమ్మెదా..

తానమాడువేళ తాను దిగబడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
తానమాడువేళ తాను దిగబడతాడే
మానుమాటు చేసి చూడ ఎగపడతాడే
చెప్పుకొంటె సిగ్గుచేటూ..అబ్భ నిప్పులాంటిచూపు కాటూ
చెప్పుకొంటె సిగ్గుచేటూ..అబ్భ నిప్పులాంటిచూపు కాటూ
ఆదమరచివున్నావా కోకలు మాయం
ఆనక ఏమనుకొన్న రాదే సాయం..

No comments: