Showing posts with label తోట రాముడు--1975. Show all posts
Showing posts with label తోట రాముడు--1975. Show all posts

Tuesday, March 29, 2011

తోట రాముడు--1975

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4537
సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది..సంబరాలు చేద్దాము రా రా  
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::1

తప్పట్లు తాళాలు మోగించండీ..తద్దిమిత తందనాలు తొక్కండీ
తప్పట్లు తాళాలు మోగించండీ..తద్దిమిత తందనాలు తొక్కండీ
రాగాలు తియ్యండి రాంభజన చెయ్యండి..రామయ్య తండ్రికీ మొక్కండిరా
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::2

రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ..బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ..బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
పైన చల్లండి బుగ్గ గిల్లండి..వరసైన అమ్మాయి వచ్చిందిరా
పైన చల్లండి బుగ్గ గిల్లండి..వరసైన అమ్మాయి వచ్చిందిరా 
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

చరణం::3

ఏడాది కొకసారి వస్తాము..ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఏడాది కొకసారి వస్తాము..ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఇచ్చినంత పుచ్చుకుని..భోగి మంటలేసుకొని..ఎగిరి గంతులేసుకుంటూ పోదాము    
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది..సంబరాలు చేద్దాము రా రా 
జాల్మైలే..హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ..జంజనకడి జంజనకడి

Friday, March 18, 2011

తోట రాముడు--1975

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4535
సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ  
గానం::S.P.బాలు 
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము 
చూస్తే కోరవు..ఈ నర జన్మము
తీపిమాటలు..గొంతు కోతలు 
నరులకు..మాకే సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::1

నోట్లను వెదజల్లి..ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు..గద్దెక్కి ఏలేరురా 
నోట్లను వెదజల్లి..ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు..గద్దెక్కి ఏలేరురా 
తలలు మార్చడం..కొంప కూల్చడం
నరులకు...మాకే సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::1

గడ్డిని నువు మేసి పాలను...మాకిస్తే  
కడుపుబ్బ తాగేమురా మేము..గరళాన్ని కక్కేమురా
గడ్డిని నువు మేసి పాలను...మాకిస్తే   
కడుపుబ్బ తాగేమురా మేము..గరళాన్ని కక్కేమురా
కాళ్ళు పట్టడం కాటు...వేయడం
నరులకు మాకే...సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::2

దేశం అంటాము తిండిని..దాస్తాము
కల్తీలు చేస్తామురా మేము..ప్రాణాలు తీస్తామురా
దేశం అంటాము తిండిని..దాస్తాము
కల్తీలు చేస్తామురా మేము..ప్రాణాలు తీస్తామురా
నీతి చెప్పడం..నిప్పు పెట్టడం   
నరులకు మాకే..సొంతము
అరె హొయ్‌...అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళు లోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము
తీపిమాటలు..గొంతు కోతలు
నరులకు మాకే..సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా

Monday, March 14, 2011

తోట రాముడు--1975

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4534
సంగీతం::సత్యం
రచన::కోసరాజురాఘవయ్య  
గానం::S.P.బాలు 
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
బీదా బిక్కీ కళ్ళు తెరిస్తే..డబ్బూ గిబ్బూ బుగ్గేరా 
సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
గోవిందా...గోవిందా

చరణం::1

నోళ్ళుకొట్టి ఆర్జించిన డబ్బూ..ఈ దెబ్బతోటి గోవిందా..గోవిందా
ఊళ్ళు దోచుకొని చేర్చిన డబ్బూ..ఈ రోజుతోటి గోవిందా..గోవిందా
జబర్దస్తుగా చెలాయించు..నీ కుర్ర పెత్తనము గోవిందా      
సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
గోవిందా..గోవిందా

చరణం::2

ఇనప్పెట్టెలో దాచిన సొమ్ములు..కాళ్ళతో నడిచి పొయేనురా..పొయేనురా
కూలీల నోట్లో మట్టిగొట్టినా..ఘోర పాతకం తగిలేనురా..తగిలేనురా
నా అను దిక్కేలేక నీ బ్రతుకు..నవ్వుల పాలయ్యేనురా  
సాగవురా సాగవురా..ఈ డబ్బుల డాబులు సాగవురా
గోవిందా...గోవిందా

చరణం::3

బలవంతంగా ఆక్రమించినా..పోరంబోకులు గోవిందా..గోవిందా
కొంపలు దీసి సంపాదించిన..మేడలు మిద్దెలు గోవిందా..గోవిందా
తేరతిండితో కొవ్విన వొళ్ళు..గడ్డి బొమ్మతో గోవిందా
అయ్యగారి పని గోవిందా..కొయ్యగారి పని గోవిందా
అయ్యగారి పని గోవిందా..కొయ్యగారి పని గోవిందా
అయ్యగారి పని గోవిందా..కొయ్యగారి పని గోవిందా

Monday, February 28, 2011

తోట రాముడు--1975

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4536
సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::P.సుశీల 
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

ఆఆ హా హా ఆ ఆ ఆ..ఆ ఆ ఆ హా హా హా
ఆఆ హా హా ఆ ఆ ఆ..ఆ ఆ ఆ హా హా హా..హే 
నేనంటే నేనే..నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరూ 
దారంటే నే వెళితే అదురూ..ఈ వూరంత నేనంటే బెదురూ
నేనంటే నేనే..నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరూ 
దారంటే నే వెళితే అదురూ - ఈ వూరంత నేనంటే బెదురూ

చరణం::1

చంద్రులోని జింకను రప్పిస్తాను..ఇసుకను పిండి తైలం గుప్పిస్తాను
చంద్రులోని జింకను రప్పిస్తాను..ఇసుకను పిండి తైలం గుప్పిస్తాను
ఆడిందే ఆట నే పాడిందే పాట..ఆడిందే ఆట నే పాడిందే పాట 
కాదంటే ఆ నోళ్ళకి..తాళం వేయిస్తాను  
నేనంటే నేనే..నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరూ 
దారంటే నే వెళితే అదురూ..ఈ వూరంత నేనంటే బెదురూ

చరణం::2

వెండి బిందెలో నీళ్ళు తోడుకొస్తాను..పసిడి గిన్నెలో పాలారగిస్తాను
వెండి బిందెలో నీళ్ళు తోడుకొస్తాను..పసిడి గిన్నెలో పాలారగిస్తాను
పంతం వస్తేనో నే పందెం వేస్తేనో..పంతం వస్తేనో నే పందెం వేస్తేనో
లక్షలైన విసిరేసి..లక్ష్యం సాధిస్తాను       
నేనంటే నేనే..నా మాటంటే మాటే..నన్నెదిరించే వారెవ్వరూ 
దారంటే నే వెళితే అదురూ..ఈ వూరంత నేనంటే బెదురూ
ఈ వూరంత...నేనంటే బెదురూ

Saturday, April 25, 2009

తోట రాముడు--1975::శివరంజని::రాగం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4517
సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల

శివరంజని::రాగం 

ఓ బంగరు రంగుల చిలక..పలకవా..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే ఉందనీ..నాపైన అలకే లేదనీ..

ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..ఆ..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే వుందనీ..నాపైన అలకే లేదనీ..ఈ..
ఓ..ఓ...ఒహోహో..ఓ..ఓ..
ఆ..ఆ..ఆ..

:::1

పంజరాని దాటుకొనీ బంధనాలు తెంచుకొనీ
నీకోసం వచ్చా ఆశతో....ఓ...
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలిచావెందుకే.....
నీ చేరువలో నీచేతులలో పులకించేటందుకే...

ఓ బంగరు రంగుల చిలక..పలకవా..ఆ..
ఓ అల్లరి చూపుల రాజా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే ఉందనీ..నాపైన అలకే లేదనీ..

:::2

సన్నజాజి తీగుందీ..తీగమీద పూవుందీ
పువ్వులోని నవ్వే..నాదిలే...
కొంటె తుమ్మెదొచ్చిందీ..జుంటి తేనె కోరిందీ..
అందించే భాగ్యం..నాదిలే....
ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే...

ఓ అల్లరి చూపుల రాజా..పలకవా..ఆ..
ఓ బంగరు రంగుల చిలకా..ఏమనీ..ఈ..
నామీద ప్రేమే వుందనీ..నాపైన అలకే లేదనీ..ఈ..