Saturday, April 25, 2009

పచ్చని కాపురం ~~1985




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్షాలు
నింగి నేల సాక్షాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

జ్ఞాపకమేదో నీడల్లె తారాడె
స్వప్నాలేవో నీ కళ్ళలో దాగె
కౌగిలింత లొన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది
నేను దేహమల్లె నీవు ప్రాణమల్లె
ఏకమైన రాసలీల ళొన

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా

అంతం లేనీ ఈ రాగ బంధం లో
అంచున నిలిచీ నీ వైపె చుస్తున్న
పున్నమింట కట్టుకున్న పూల డోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మోడైనవి
బాలచంద్రుడొస్తే నులు పోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా
చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము
నీ ప్రేమే శాశ్వతము

ఏ జన్మదో ఈ బంధము
ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్షాలు
నింగి నేల సాక్షాలు
ప్రేమకు మనమే తీరాలు

No comments: