Saturday, April 25, 2009
మరోచరిత్ర ~~1979
సంగీతం::MS.విశ్వనాథన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.జానకి
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే
పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు..2
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శతకోటి దండాలు
నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు
భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వేళలకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు శతకోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే
చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు శతకోటి దండాలు
Labels:
S.Jaanaki,
మరోచరిత్ర -1978
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment