సంగీతం: K.V.మహదేవన్ రచన::ఆత్రేయ గానం::S.P.బాలు , P.సుశీల Falm Directed By::Daasarinaaraayana Rao తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ. పల్లవి: చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివీ చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి చెప్పనా..చెప్పనా..చెప్పనా అడగనా..నోరు తెరిచి అడగరానివి..ఈ అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ..ఈ అడగనా..అడగనా..అడగనా చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివి అడగనా..నోరు తెరిచి అడగరానివి చరణం::1 చెప్పమనీ..చెప్పకుంటే ఒప్పననీ చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా? అడగమనీ..అడగకుంటే జగడమనీ అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా? అడుగు మరి..చెప్పు మరి అడుగు మరి..చెప్పు మరి చెప్పితే అల్లరి..అడిగితే తుంటరి చెప్పనా..సిగ్గు విడిచి చెప్పరానివి అడగనా..నోరు తెరిచి అడగరానివి చరణం::2 నిన్న రాత్రి వచ్చి..సన్న దీప మార్పి పక్క చేరి నిదురపోవు సోయగాన్ని వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే పిల్ల గతి..కన్నెపిల్ల గతి ఏమిటో..చెప్పనా పగటి వేళ వచ్చి..పరాచకలాడి ఊరుకొన్న పడుచువాణ్ణి..ఉసిగొలిపి పెదవి చాపి..పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే ఇవ్వమనీ..ఇచ్చి చూడమని..ముద్దులే అడగనా వద్దని..హద్దు దాట వద్దనీ అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా నేననీ..వేరనేది లేదనీ..అనీ అనీ..ఆగమని ఆపుతున్నదెందుకని అడగనా అడుగు మరి..చెప్పు మరి అడుగు మరి..చెప్పు మరి చెప్పితే అల్లరి..అడిగితే తుంటరి అడగనా..అడగనా..అడగనా చెప్పనా..సిగ్గు విడిచి..చెప్పరానివి అడగనా..నోరు తెరిచి..అడగరానివి
సంగీతం::K.V.మహాదేవన్ రచన::వేటూరి గానం::SP.బాలు,P.సుశీల Falm Directed By::Daasarinaaraayana Rao తారాగనం::శోభన్‌బాబు,M.ప్రభాకర్‌రెడ్డి,కనకాల దేవదాస్,J.V.రమణమూర్తి,చలాం.సావిత్రి,సుజాత,రమాప్రభ,వక్కలంక పద్మ. పల్లవి:: కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం
చరణం::1 మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసుమాటకందని నాడు మధురమైన పాటవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలివేకువూలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం
చరణం::2 కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కొంటెవయసు కోరికలాగా గోదారి ఉరకలు చూదు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి... కోటి రాగాలు ఉన్నాయి... ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం కొమ్మ కొమ్మకో సన్నాయి...