సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::మోహనరాజు
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు
పల్లవి::
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం
ఆ నాటకాన..నువ్వూ నేను
ఆటబొమ్మలం..కీలుబొమ్మలం
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం
ఆ నాటకాన..నువ్వూ నేను
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం
చరణం::1
నాదీ నావాళ్ళనే..తాళ్ళతో కడుతుంది
నాదీ నావాళ్ళనే..తాళ్ళతో కడుతుంది
ఆ తాళ్ళు లాగి నీ చేత..తైతక్కలు ఆడిస్తుంది
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం
ఆ నాటకాన..నువ్వూ నేను
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం
కనబడని చెయ్యేదో..నడుపుతోంది నాటకం
ఆ నాటకాన..నువ్వూ నేను
ఆటబొమ్మలం..మ్మ్..కీలుబొమ్మలం
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
చరణం::2
తలచింది జరిగిందంటే..నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ..విధిపై నెడతావు
తలచింది జరిగిందంటే..నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ..విధిపై నెడతావు
మనము మనవాళ్ళని..మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో..తెంచుకోని పోతావు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
చరణం::3
కర్మను నమ్మినవాళ్ళెవరూ..కలిమిని
స్థిరమనుకోరు..కళ్ళుమూసుకోరు
మనసు తెలిసిన..వాళ్ళెవరూ
మమత చంపుకోరు..మనిషినొదులుకోరు
ఉన్నదాని..విలువెరుగనివాళ్ళు
పోగొట్టుకొని....విలపిస్తారు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
చరణం::4
మనిషిలాగ జీవించేది..నీ చేతల్లోనే వుంది
మంచీ చెడు ఏదయిన ..నీ చేతుల్లోనే వుంది
మనిషిలాగ జీవించేది..నీ చేతల్లోనే వుంది
మంచీ చెడు ఏదయిన..నీ చేతుల్లోనే వుంది
కావాలని నిప్పు తాకితే..చేయి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే..గాయమేమో మానదు
కనబడని చెయ్యికాదు..నడిపేది నాటకం
కనబడుతూ నువ్వూ నేనే..ఆడుతాము బూటకం
No comments:
Post a Comment