Friday, October 30, 2009

తాసిల్దారు గారి అమ్మాయి--1971




























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

పల్లవి::

నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము..యీనాడు  
కలసి వుంటాము..ఏనాడు

నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము..యీనాడు  
ఆ..కలసి వుంటాము..ఏనాడు 

చరణం::1

కొండల నంటి..కోనలు వున్నాయి
ఆ..ఆ..కోనల కండగ..కొండలు వున్నాయి
ఎండ వానలు..ఎన్నో చూచాయి 
అహహ..
ఇలాగే నిన్నూ నన్నూ..వుండమన్నాయి..ఆఆఆఅ  
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు 

చరణం::2

ఎన్నెన్ని వసంతాల..సొగసు తెచ్చినావో 
ఎన్నెన్ని సెలయేళ్ళ..చలువై వెలిసావో
ఎన్నిసార్లు నీ యెదలో..నన్ను దాచినావో 
ఎన్ని జన్మలను బంధం..మోసుకొచ్చినావో
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు

చరణం::3

మనసే మనకు తెలిసిన కోవెలగా..ఆఆఆ 
మమతే మనము కొలిచే దైవముగా..ఆఆఆ
జీవితమే ఒక దీపారాధనగా..ఆహాహాహ 
చెలిమే నువ్వూ నేనూ..కోరే వరముగా..ఆఆఆ  
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు 
నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ 
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము యీనాడు..కలసి వుంటాము ఏనాడు
ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా 

No comments: