Showing posts with label సంసారం-1978. Show all posts
Showing posts with label సంసారం-1978. Show all posts

Sunday, March 30, 2014

సంసారం--1978


సంగీతం::T.చలపతి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Taatineni Prakaasha Rao
తారాగణం::N.T.రామారావు,చంద్రమోహన్,జగ్గయ్య,కైకాల సత్యనారాయణ,ప్రభాకర్‌రెడ్డి,మిక్కిలినేని,అల్లురామలింగయ్య,రావికొండల్‌రావు,మాడా,శేఖర్,చిట్టిబాబు,జమున,రోజారమణి,జయసుధ,పుష్పకుమారి,ఝన్సీ,జయమాలిని.

పల్లవి::

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

కలతలన్నీ..కరిగిపోగా
కలసీ మెలసీ..మురిసేరోజు

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

చరణం::1

చిందులువేసే..మా పాప
కంటికి విందులు..చేయాలి

పెరిగి పెద్దదై..చదువులు చదివి
పెద్దలు మన్నలు..పొందాలి

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

చరణం::2

మల్లెలలోనీ..చల్లదనాలు
మనసులలో..విరబూయాలి

మమతల దివ్వెల....నవ్వులతో
మన యిల్లంతా..వెలగాలి

ఎవ్వరికీ..తలవంచకనే
ఎన్నడు నిరాశ..చెందకనే 

ఆత్మగౌరవం..పెంచుకొని
అడుగు ముందుకే..వేయాలి

మా పాప..పుట్టినరోజు
మరపురాని..పండుగరోజు

Samsaaram--1975
Music::T.Chalapati
Lyrics::Daasarathi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Taatineni Prakaasha Rao
Cast::N.T.Raamaa Rao,Chandramohan,Jaggayya,Kaikala Satyanaaraayana,Prabhaakar Reddi,Mikkilineni,Alluraamalingayya,Maadaa,Sekhar,Raavikondalrao,Chittibaabu,Jamuna,Rojaaramani,Jayasudha,Puspakumaari,Jhansi,Jayamaalini.

:::::::::::::::::::::::::::::::

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

kalatalannii..karigipOgaa
kalasee melasee..murisErOju

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

::::1

chinduluvEsE..maa paapa
kanTiki vindulu..chEyaali

perigi peddadai..chaduvulu chadivi
peddalu mannalu..pondaali

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

::::2

mallelalOnii..challadanaalu
manasulalO..virabooyaali

mamatala divvela....navvulatO
mana yillantaa..velagaali

evvarikii..talavanchakanE
ennaDu niraaSa..chendakanE 

Atmagouravam..penchukoni
aDugu mundukE..vEyaali

maa paapa..puTTinarOju
marapuraani..panDugarOju

Monday, October 05, 2009

సంసారం--1975







సంగీతం::T.చలపతి
రచన::డా.సినారె
గానం::S.జానకి,M.రమేష్


ఒంటరిగా ఉన్నామూ..మనమిద్దరమే..వున్నామూ
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

ఎవరికంటపడినా..ఏమనుకొంటారూ..
పడుచువాళ్ళ సరదా..పోనీ అంటారూ..2
ఏదో గుబులు..ఎందుకు దిగులు..2
ఎగిరిపోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

గువ్వజంట ఏదో..గుసగుసలాడిందీ
వలపు ఓ న మాలూ..దిద్దుకోమన్నదీ..2
ఇపుడేవద్దు..ఒకటేముద్దు..2
రేపుచూద్దాము రా..రా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..

ఇంతమంచి సమయం..ఎపుడు దొరుకుతుందీ
మూడుముళ్ళుపడనీ..ప్రతిరోజు దొరుకుతుందీ..2
అప్పటి వరకు అల్లరివయసు..2
ఆగనంటుంది రా..రా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..
ఉలకవెందుకు..పలకవెందుకు..
బిడియమెందుకు వలపు విందుకు..
కలసి పోదాము రారా..

ఒంటరిగా ..హ్హా..హ్హా..ఉన్నామూ
మనమిద్దరమే..హ్హే..హ్హే..వున్నామూ..