Friday, October 30, 2009

తాసిల్దారు గారి అమ్మాయి--1971
























సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల

పల్లవి::

పాడమన్నావు..పాడుతున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను 
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను

చరణం::1

మనసును మార్చి పాడలేక
నామాటలే పాటగ మార్చాను
మనసును మార్చి పాడలేక
నామాటలే పాటగ మార్చాను
మాటల తోటి కదలని..మనసు
మాటల తోటి కదలని..మనసు
పాటకు కదలి..పలికేనేమో..ఓఓ
ఏమో పాడమన్నావు పాడుతున్నాను 
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను

చరణం::2

చినుకులకు చిగురించును మోడు
పదునైతే మొలకెత్తును బీడు
చినుకులకు చిగురించును మోడు
పదునైతే మొలకెత్తును బీడు
నువ్వేమో పదును అదును తెలియదన్నావు 
నువ్వేమో పదును అదును తెలియదన్నావు
నేనేమొ పరుల సొమ్ము కాలేకున్నాను
పాడమన్నావు..పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను

చరణం::3

పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా 
పాతపాటే పాడుతున్నానా లేత వలపే నీదన్నా
మూసిన తలుపు యికనైనా మూసిన తలుపు యికనైనా 
తీసిచూడు నేనున్నానేమో ఏమో..పాడమన్నావు పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను

No comments: