సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
పల్లవి::
జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు..ఈ రోజైనా తెలుసుకుంటావా

హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
చరణం::1
నిగనిగలాడే నీలికళ్ళలో..నీడెవ్వరిదో చూస్తావా
గుబగుబలాడే గుండెలోపల..గుబులెవ్వరిపై చెపుతావా

రేపని మాపని ఆశలు పెడతావా..రేపని మాపని ఆశలు పెడతావా
నీదేనని ఒప్పుకుంటావా..నేనంతటి వాడిని కానంటావా
జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు ఈ రోజైనా తెలుసుకుంటావా
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా..ఆ
చరణం::2
నిలవక ఎగిరే పైటకొంగును..నీతో ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో..అడుగులేడు నడిపిస్తావా
నిలవక ఎగిరే పైటకొంగును నీతో..ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో..అడుగులేడు నడిపిస్తావా
కంచము మంచము ఒక్కటి చేస్తావా..కంచము మంచము ఒక్కటి చేస్తావా
నా వాడిగ వుండిపోతావా..నీ కంతటి రాత లేదంటావా
జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు..ఈ రోజైనా తెలుసుకుంటావా
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా..గాజుల గలగల వింటావా..ఆ
No comments:
Post a Comment