సంగీతం::K.V .మహదేవన్ రచన::ఆత్రేయ గానం::ఘంటసాల,P.సుశీల పల్లవి:: చకచకలాడే..నడుముచూడు నడుమును వూపే..నడకచూడు నడకను చూస్తూ వెనకబడే యీ పడుచువానిలో పొగరూ చూడు కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::1 కరినాగంటి..జడచూడు అది కాటేస్తేనే..మగవాడు సుడిగాలంటి..మగవాడు నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు కరినాగంటి..జడచూడు అది కాటేస్తేనే..మగవాడు సుడిగాలంటి..మగవాడు నన్ను చుట్టెయ్యాలి..ఒకనాడు అది నిజమవుతుందన్నాను నీ గడుసుతనాన్ని..మెచ్చాను కోలకన్నుల కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది..ఆహా కోరికదాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::2 చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను చెప్పలేక ఎన్నాళ్ళో..దాచుకున్నాను నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు..ఊరుకున్నాను చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి చెప్పలేనివి చెప్పేటందుకె..కన్నులున్నాయి అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి అవి ఒప్పుకుంటె మనసులు..రెండూ ఒకటవుతాయి అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ
కోలకన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది చరణం::3 పిల్లను చూచిన..అబ్బాయి నీ పెళ్ళికి నేనూ..వస్తాను పెళ్ళికి వచ్చే..అమ్మాయి నా పక్కన పీటే..యిస్తాను పిల్లను చూచిన..అబ్బాయి నీ పెళ్ళికి నేనూ..వస్తాను పెళ్ళికి వచ్చే..అమ్మాయి నా పక్కన పీటే..యిస్తాను నా మనసున..పీటను వేశాను నీ మమతకు..తాళికట్టాను కోలకన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది చకచకలాడే..నడుముచూడు నడుమును వూపే..నడకచూడు నడకను చూస్తూ..వెనకబడే యీ పడుచువానిలో..పొగరూ చూడు కోల కన్నుల..కుర్రదానా నీ కోపంలోనే..కోరికవుంది కోరిక దాచిన..కుర్రవాడా నీ కొంటెదనంలో..గమ్మత్తు వుంది
సంగీతం::చక్రవర్తి రచన::దాసరి నారాయణ రావ్ గానం::P.సుశీల, S.P.బాలు పల్లవి:: ఒక లైలా కోసం..తిరిగాను దేశం ఒక లైలా కోసం..తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ ఒక లైలా కోసం తిరిగాను దేశం చరణం::1 ఆకాశానికి నిచ్చెన..వేసీ చుక్కల..పట్టుకొనడిగానూ లైలా ఏదనీ..నా లైలా ఏదనీ స్వర్గానికి నే దారులు..వెతికీ ఇంద్రుని..పట్టుకొనడిగానూ లైలా ఏదనీ..నా లైలా ఏదనీ దిక్కుల నడుమా..నేనుంటే చుక్కల..పట్టుకొనడిగావూ కన్నుల ముందూ..నేనుంటే కన్నులు మూసుకు..వెదికావూ ప్రతి చూపూ..ప్రతి పిలుపూ ప్రతి చోటా..నీకోసం ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ ఒక లైలా కోసం..తిరిగాను దేశం చరణం::2 పగలూ రేయీ..పందెం వేసీ సృష్టిని పట్టుకు..బ్రతిమాలాయి మజ్ఞూ ఏడనీ..నా మజ్ఞూ ఏడనీ రంభా ఊర్వశి..ధైర్యం చేసీ స్వర్గం విడిచీ..వచ్చారూ లైలా నేననీ హహహ..ఆ లైలా నేననీ ఇల్లూ వాకిలి..వదిలొస్తే రంభా ఊర్వశి..అంటావూ నీకోసం..నే పుట్టొస్తే ఎవ్వరి వెంటో..పడతావూ ప్రతి రాత్రీ ప్రతి పగలూ ..ప్రతి తలపూ నీ కోసం ఒక మజ్ఞూ కోసం..వెతికాను లోకం ప్రతి పగలూ ప్రతి రాత్రీ..ప్రతి తలపూ అతని కోసం మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊ..మజ్ఞూ..ఊఊ ఒక లైలా కోసం..తిరిగాను దేశం ప్రతి రోజూ ప్రతి రాత్రీ..ప్రతి పాటా ఆమె కోసం లైలా..ఆ..లైలా..ఆ..లైలా..ఆ