Monday, January 19, 2009

గజదొంగ--1980





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి


నీ ఇళ్ళు బంగారంగాను...
నా ఒళ్ళు సింగారంగాను...
జోరుమీద ఉన్నవు జోడు కడతావా...
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా...


నీ ఇళ్ళు బంగారంగాను...
నా ఒళ్ళు సింగారంగాను...
పొంగుమీద ఉన్నవు తోడు పెడతావా...
మురిపాల మీగడంత తోడిపెడతావా...


నీ ఇళ్ళు బంగారంగాను...
నా ఒళ్ళు సింగారంగాను...


ఓ..హో..గోల్డ్ మేన్
ఓ..హో..గోల్డ్ మేన్


బంగారు కొండమీదా శృంగార కోటలోనా..
చిలకుంది తెమ్మంటావా...చిలకుంది తెమ్మంటావా
రతనాల రాసిరేళా..
పగడాల పక్కచూపి..
బులిపింది రమ్మంటావా..


ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట..
హారాలకే అగ్రహారాలు రాసిస్తా..
అందాల గని ఉంది నువ్వు చూసుకో...
నీకందాక పని ఉంటె నన్ను చూసుకో...


నీ ఇళ్ళు బంగారంగాను...
నా ఒళ్ళు సింగారంగాను...హా..హా..హా..హా..హా..


వజ్రాలవాడలోన వైడూర్యమంటి నన్నూ..
వాటేయ వద్దంటావా...వాటేయ వద్దంటావా
ముత్యాల మేడలోనా...
మాణిక్యమంటి నన్నూ...
ముద్దాడ వస్తుంటావా...


వరహాల పందిట్లో విరహాలు నీకేల
రతనాల ముంగిట్లొ రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో...
ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో...


నీ ఇళ్ళు బంగారంగాను..
నా ఒళ్ళు సింగారంగాను..

జోరుమీద ఉన్నవు జోడు కడతావా..
మురిపాల మీగడంత తోడిపెడతావా..అ..హా..హా

No comments: