సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆత్రేయ
నిర్మాత::T.విశ్వేశ్వరరావు
దర్శకత్వం::బాలచందర్
సంస్థ::భారత్ ఫిలింస్
గానం::S.జానకి
తారాగణం::జయసుధ, కమల్‌హాసన్, చిరంజీవి, శరత్‌బాబు
పల్లవి::
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా
చరణం::1
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడికేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా
చరణం::2
ఓ తెమ్మెరా ఊపవే ఊహల ఊయల నన్ను
ఓ మల్లికా ఇవ్వవే నవ్వుల మాలిక నాకు
తల్లి మళ్ళి తరుణయ్యింది పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతె తప్పేముంది
గాలికదుపు లేదు కడలికంతు లేదు
గంగవెల్లువ కమండలంలో ఇమిడేదేనా
ఉరికేమనసుకి గిరిగీస్తే అది ఆగేదేనా
No comments:
Post a Comment