Monday, January 19, 2009

పల్లెటూరి బావ--1973



సంగీతం::T.చలపతి రావ్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల


రంగే...ఒసే వయ్యారి రంగి వగలమారి..వగలమారి బుంగి
ఊగిందె నీ నడుము ఉయ్యాలా..ఆ ఊపు చూస్తుంటే
నేనోప లేకుంటే పాడిందే నా మనసు జంపాలా

ఒసే వయ్యారి రంగి వగలమారి..వగలమారి బుంగి
ఊగిందె నీ నడుము ఉయ్యాలా..ఆ ఊపు చూస్తుంటే
నేనోప లేకుంటే పాడిందే నా మనసు జంపాలా


నీ సూపులో వుందే పిడిబాకు దాని పదునెంతో చూస్తానే
నీ సెంపలోనుందె సిగురాకు దాని వగరెంతో చెబుతానే
ఈఏళ కాదని అనమాకు..ఈఏళ కాదని అనమాకు
ఇక ఎన్నాళ్ళే ఈ కులుకూ....
నా రవ్వా..నా గువ్వా..నా మువ్వా..ఓ..రంగమ్మా..
జివ జివ లాడిందే...మనసే గుబ గుబ లాడిందే


ఒసే వయ్యారి రంగి వగలమారి..వగలమారి బుంగి
ఊగిందె నీ నడుము ఉయ్యాలా..ఆ ఊపు చూస్తుంటే
నేనోప లేకుంటే పాడిందే నా మనసు జంపాలా


ఎగిరెగిరి పడుతుందే నీ పైట
ఓహో..ఈ పాటి చిరుగాలికే...
ఉరికురికి వస్తుందే నీ వయసు
అహా..నాతోటి జగడానికే...
అదిరదిరి పడుతుందే నీ మనసూ....
అదిరదిరి పడుతుందే నీ మనసూ
ఉతుత్తి సరసాలకే..నా కన్నా..నా చిన్నా..నా పొన్న..ఓ..రంగమ్మా..
జివ జివ లాడిందే..మనసే..గుబ గుబ లాడిందే


ఒసే వయ్యారి రంగి వగలమారి..వగలమారి బుంగి
ఊగిందె నీ నడుము ఉయ్యాలా..ఆ ఊపు చూస్తుంటే
నేనోప లేకుంటే పాడిందే నా మనసు జంపాలా


కోటప్ప తిరణాలకెళ్ళినప్పుడు
మనం కొన్నామె గుళ్ళపేగూ...
అది రోమ్ము మేద అటు ఇటు దొర్లుతుంటే
నాకు రిమ్మతెగులు రేగుతుందే..
పెళ్ళైన వాణ్ణని జంకమాకూ
పెళ్ళైన వాణ్ణని జంకమాకూ
ఒకరికి ఇద్దరైన వేడుకేలే....
నా చిట్టి..నా పొట్టి..నా పట్టి..
ఓ రంగమ్మా..ఏస్తానే మూడుముళ్ళు...రంగమ్మా...
ఏస్తానే మూడుముళ్ళు..పిపీ..పిప్పీపి..డుం..డుం..
పిప్పిప్పీ..డుం డుం డుం..పిప్పిప్పీ..డుం డుం డుం..
పిప్పిప్పీ..డుం డుం డుం..డుం డుం డుం..పిప్పిప్పీ..డుం డుం డుం....

No comments: