Monday, January 19, 2009

ఇది కథ కాదు--1979::కానడ::రాగం





సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By::K.Baalachandar

తారాగణం::కమల్‌హాసన్,చిరంజీవి,శరత్‌బాబు,జయసుధ,లీలావతి.

కానడ::రాగం

(హిందుస్తానీ ~ కర్నాటక)

పల్లవి::

సరిగమలు గలగలలు
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము
ప్రియురాలే నాట్యము
చెలి కాలి మువ్వల గల గలలూ..
చెలి కాలి మువ్వల గల గలలూ..
చెలికాని మురళిలో....
సరిగమలు గలగలలు
సరిగమలు గలగలలు


::::1


ఆవేశమున్న ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్న ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము
ప్రియురాలే నాట్యము


::::2


హృదయాలు కలవాలి ఒక శ్రుతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలొ
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు
సరిగమలు గలగలలు...సరిగమలు గలగలలు


:::3


నయనాలు కలిసాయి ఒక చూపులొ
నాట్యాలు చెశాయి నీ రూపులొ
నయనాలు కలిసాయి ఒక చూపులొ
నాట్యాలు చెశాయి నీ రూపులొ
రాధనై పలకని నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
సరిగమలు గలగలలు
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము
ప్రియురాలే నాట్యము
అహహా...అహహా...
అ..ఆ..ఆ..ఆ..ఆ..

అహహా...అహహా...
అ..ఆ..ఆ..ఆ..ఆ..

No comments: