ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::S.R.Puttanna
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,శోభన్‌బాబు,S.V.రంగారావు,నాగయ్య,రేలంగి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,
రాజబాబు,రమాప్రభ,రుక్మిణి.
పల్లవి::
నా హృదయపు కోవెలలో..ఆ..ఆ
నా బంగరు లోగిలిలో..ఆ ఆ ఆ
ఆనందం నిండెనులే...
అనురాగం పండెనులే..ఆ..హా..ఆ..
నా హృదయపు కోవెలలో
చరణం:: 1
ఆ..హా..ఆ..ఆ..ఆ
మధువులు కురిసే గానముతో
మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో
నా మనసును నిలువున దోచితివే
నా హృదయపు కోవెలలో...
చరణం:: 2
ఆ హా ఆ హా ఆ ఆ
శాంతికి నిలయం నీ హృదయం
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మీ సరస్వతి నీవేలే...
నా బ్రతుకున కాపురముందువులే
బ్రతుకున కాపురముందువులే
నా హృదయపు కోవెలలో...
చరణం:: 3
ఆ హా ఆ ఆ ఆ ఆ
ఇంటికి నీవే అన్నపూర్ణగా..
ప్రతిరోజూ ఒక పండుగగా..
వచ్చే పోయే అతిధులతో..
మన వాకిలి కళకళలాడునులే..
నా హృదయపు కోవెలలో
నా బంగరు లోగిలిలో...
ఆనందం నిండెనులే అనురాగం పండెనులే..మ్మ్ మ్మ్ మ్మ్
నా హృదయపు కోవెలలో
No comments:
Post a Comment