Wednesday, July 25, 2007

శ్రీకృష్ణ తులాభారం--1966






సంగీతం::పెండ్యాల
రచన::దాశరథి
గానం::ఘంటసాల


పల్లవి::

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము
కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము
ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

మునివరా... తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
ఘనులు స్వాదృశులే ఇటులన్
కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

చరణం::1

ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
కాదనుకొను డౌననుకొనుడొక మనసు నిష్కళంకముగా
నొనరించి తృణంబొసగిన వెను వెంటనే నడచుచుండు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరుగున తడయగా

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

చరణం::2

ఏ విధి సవతులనిక వీక్షింపగలను
ప్రతి వచనంబేవిధాన బలుకగలను
ఎంత జేసితివి ముని
నీవు సత్యవంతుడవని ఎంచి
ఇట్లు పొరబడితిని మునివరా...

ఇదియే తుది సమయము త్వరపడుడు
ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి
ఇదియే తుది సమయము
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
అదృష్టమింతకెవరిదియో విధిగా
అచటికే కనునుగా ముదంబిపుడు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి భలే మంచి
భలే మంచి చౌక బేరము

చరణం::3

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
యహ నారదుండంట సన్నాసి గండడంట
దొరగారినమ్మునంట తన బాబు సొమ్మంట
అహ కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి

గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
గడియ గడియకొచ్చి అమ్మగార్ని మోసపుచ్చి
మెడకు తాడు గట్టి సొంత మేకపిల్లలాగ తెచ్చి
నడి బజారులోన కిట్ట సామినమ్మునంట
నీ తాత సొమ్మంట ఈడ కాసుకొన్నడంట
పుడికి తంగములాగ తంబుర మెడనేసుకుని
కడుపు లేక వాగుతారు నడుము విరిగి చచ్చేటట్టు

కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
జుట్టూడ లాగండి చెవులు మెలేయండి
కొట్టు కొట్టండి కొట్టండి బుర్ర పగల
నడుములిరగ బుర్ర పగల చచ్చేటట్టు కొట్టండహే

No comments: