సంగీతం::రమేష్ నాయుడు
రచన::నారాయణ రెడ్డి
గానం::P.సుశీల
తొలిరేయీ..ఇది తొలిరేయి
ఇద్దరమూ..చెరిసగమూ
ముద్దూ ముచ్చట..పంచుకొనే
తొలిరేయీ..ఇది తొలిరేయి
పెళ్ళిపందిట నీవువేసిన..మూడుముళ్ళూ
చల్ల చల్లగా వుండాలి..అవి ఒక నూరేళ్ళూ
మూగ గదిలో నేడు పలికే..ఈ రాగం..ఆ
ముందు ముందు బ్రతుకును..పండించె అనురాగం
నవదంపతులా ఆశా లతలా..పూచిన తొలిపూవు ఈ రేయీ
!! తొలిరేయీ ఇది తొలిరేయి !!
కన్నులేమో వేరు వేరు..కలలు ఒకటేలే
తనువులేమో వేరు వేరు..మనసులొకటేలే
పూలపానుపులా..వేయిమల్లెలా..పిలుపులొకటేలే
కలవరించే కోటికోర్కెలా..గమ్యమొకటేలే
గమ్య మొకటేలే
ఆలు మగలా అంతరంగాల..అందాలతొలకరి..ఈ రేయీ
తొలిరేయీ..ఇది తొలిరేయి
ఇద్దరమూ..చెరిసగమూ
ముద్దూ ముచ్చట..పంచుకొనే
తొలిరేయీ..ఇది తొలిరేయి
No comments:
Post a Comment