Wednesday, December 05, 2007

మరణమృదంగం--1988::సింధుబైరవి::రాగం




మరణ మృదంగం--1988
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల
సింధుబైరవి::రాగం

పల్లవి::

కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా

చరణం::1

మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో..ఒకే ధ్యాసగా
ఏ ఊసులో..ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే 
పండించుకోమని తపించగా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా

చరణం::2

అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలుకలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో శృతే మించగా
ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో 
నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను నీ వంశధారలా

No comments: