సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం:SP. బాలు ,S.జానకి
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిలమిల మెరిసిన తార ..మిన్నుల విడిన సితార
మిలమిల మెరిసిన తార ..మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులాడేమైనా మైనా
మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులాడేమైనా మైనా
No comments:
Post a Comment