Wednesday, December 05, 2007

మరణమృదంగం--1988

మరణమృదంగం--1988
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.చిత్ర

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమ

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టేక పోదండి ప్రేమ

మహా కసిగున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముగ్గుల్లో ముంచేసి ముద్దల్లె తడిపేసి
కొట్టండి కొట్టండి...

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమ

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టేక పోదండి ప్రేమ

చరణం::1

కళ్ళు కళ్ళు కలిసాక కవ్వింతగా
ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమ
ఒళ్ళు ఒళ్ళు కలిసాక ఓ జంటగా
ఎద ఎద కలిపేది ప్రేమ
శృంగార వీధుల్లోన షికారు చేసి
ఊరోళ్ళ నోళ్లల్లోన పుకారు వేసి
పరువమే హుషారు పుట్టించి
పరువునే బజారుకెక్కించి
మాటిస్తే వినుకోదు లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు ఊరిస్తే ఊర్కోదు
ఈ చిగురు వలపు చిలిపి పిలుపు
కొట్టండి కొట్టండి

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమ

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టేక పోదండి ప్రేమ

మహా కసిగున్నది భలే రుచిగుంటది
ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది
ఈ ముగ్గుల్లో ముంచేసి ముద్దల్లె తడిపేసి
కొట్టండి కొట్టండి...

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమ

కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టేక పోదండి ప్రేమ

చరణం::2

మళ్ళి మళ్ళి అంటుంది మారాముగా
ఒళ్ళోకొచ్చి పాపంటి ప్రేమ
తుళ్ళి తుళ్ళి పడుతోంది మర్యాదగా
చెల్లించెయ్యి ఆ కాస్త ప్రేమ
మంచాల అంచుల్లోన మకాము చేసి
మందార గంధాలెన్నో మలాము వేసి
వయసునే వసంతమాడించి
మనసులో తుళ్ళింత పుట్టించి
చూపుల్తో శృతి కాదు మాటల్తో మతి రాదు
ముద్దులతో సరి కాదు ముట్టంగా చలి పోదు
ఈ మనసు మదన తనువు తపన

No comments: