Wednesday, December 05, 2007

అభిలాష--1984



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో

సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో



కొండా కోనా జలకాలాడే వేళ..కొమ్మారెమ్మా చీరకట్టే వేళ
పిందె పండై చిలక కొట్టే వేళ..పిల్లా పాపా నిదరేపోయే వేళ
కలలో కౌగిలి కన్నులు దాటాలా
ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల

సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో


మల్లె జాజి మత్తుజల్లే వేళ ..పిల్ల గాలి జోలపాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ ..నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నలగుమ్మ చీకటి గువ్వలాడాలా

సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
అరెరెరెరె ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది

No comments: