Monday, December 03, 2007

శుభలేఖ--1982



సంగీతం::KV.మహదేవన్
రచన::వేటూరి
గానం::SP.బాలు ,P.సుశీల

రాగాల పల్లకిలో కోయిలమ్మా..

రాలేదు ఈవేళ ఎందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి....
తెలుసు..అందుకే..
రాలేదు ఈ వేళ కోయిలమ్మా

రాగాలే మూగబోయినందుకమ్మా

రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ ఎందుకమ్మా
రాలేదు ఈవేళ కోయిలమ్మా

రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా..

రాలేదు ఈవేళ ఎందుకమ్మా..ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి..
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి..
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమో....

హహహాహ..హుహహహుాహాహా
బహుశా అది తెలుసో ఏమో జాణకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ


రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేదు ఈవేళ అందుకేనా..అందుకేనా....

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు..
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు..
గుండెలో బాధలో గొంతులో పాటలై పలికినప్పుడు..
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు..
బహుశా తను ఎందుకనేమో..లలలాలల లలలాలాలా
బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ


రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేనా నీవుంటే కూనలమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా

రాలేనా నీవుంటే కూనలమ్మా..

No comments: