సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘటసాల
తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు
:::::
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు....
ఓ...లలనా..అదినీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
ఎవరని యెంచుకోనినావో
పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో
భ్రాంతి పడినావో
సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ...లలనా..అదినీకే తెలుసు
ఒకసారి నన్నుచూడరాదా
చెంతచేర సమయం ఇదికాదా
ఒకసారి నన్నుచూడరాదా
సమయమిదికాదా చాలునీ మరియాదా...
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ...లలనా..అదినీకే తెలుసు
మగడంటే మోజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా
నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..
ఓ లలనా..ఓ చెలియా..ఓ మగువా..
అది నీకే తెలుసు
No comments:
Post a Comment