సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజురాఘవయ్య
గానం::ఘంటసాల,P.సుశీల
ఆమె::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదు
ప్రేమించామంటారు పెద్దగ చెపుతుంటారు
పెళ్ళిమాట ఎత్తగానే చల్లగ దిగజారుతారు
అతడు::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు
లవ్ మారేజీలంటు లగ్నం పెట్టేస్తారు
అతడు::అమ్మబాబోయ్ నమ్మరాదు ఈ వగలమారి అమ్మాయిల నమ్మరాదు
కట్నాలు పెరుగునని కాలేజి కెల్తారు
కట్నాలు పెరుగునని కాలేజి కెల్తారు
హాజరు పట్టి వేసి గైరు హాజరవుతారు
మార్కుల కోసం తండ్రుల తీర్థయాత్ర తిప్పుతారు
ఇంజనీర్లు డాక్టర్లాయి ఇక చూస్కోమంటారు
అమ్మ బాబోయ్
వరందాలోన చేరి వాల్చూపులు విసురుతారు
వరందాలోన చేరి వాల్చూపులు విసురుతారు
సినిమాలు షికార్లంటు స్నేహం పెంచేస్తారు
తళుకు బెళుకు కులుకులతో పైట చెంగు రాపులతో
చిటికెలోన అబ్బాయిల చెంగున ముడివేస్తారు
అమ్మబాబోయ్ నమ్మరాదు
దిమ్మతిరిగి ఏమిటలా తెల్లమొగం వేస్తావు
వలపుదాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు
మనసు మనసు తెలుసుకొందాము
ఇకనైన జల్సాగా కలిసి వుందాము
No comments:
Post a Comment