Friday, September 28, 2007

ఇల్లరికం--1959



సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::P.సుశీల,ఘటసాల,మాధవపెద్ది.

తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు

:::::

చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు
రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి..ఓ..ఒహో..ఓ..ఒహో..
పాలూ తేనె కలిసిన మాదిరి
ఆలు మగలు ఉండాలి
గువ్వల జంట కులికే రీతిగ
నవ్వుల పంటా పండాలీ
నవ్వుల పంటా పండాలీ
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


కొత్త కుండలో నీరు తియ్యన
కోరిన మగవాడే తియ్యన
కొత్త కుండలో నీరు తియ్యన
కోరిన మగవాడే తియ్యన
కొత్త కాపురం చక్కని వరము
కోరిక తీరు రయ్ రయ్యన
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు


వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి..ఓ..ఒహో..ఓ..ఒహో..
వన్నెల చిన్నెల వలపు తోటలో
పూల బాటలే వెయ్యాలి
అన్యోన్యంగా దంపతులెపుడు
కన్నుల పండుగ చేయాలీ
కన్నుల పండుగ చేయాలీ
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
ఇద్దరి మధ్య పొందిక ఉంటే
రానే రావు పొరపాట్లు
రానే రావు పొరపాట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు
చేతులు కలిసిన చప్పట్లూ
మనసులు కలిసిన ముచ్చట్లు

No comments: