సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం::ఘటసాల
రాగం:::కల్యాణి(యమున్)
తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R.ఆంజనేయులు
:::
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా
కనులకు నే కనిపించనులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
నీడలో దోబూచిగా ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే
దాగుడుమూతలు చాలునులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే
ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
No comments:
Post a Comment