Friday, September 28, 2007

ఇల్లరికం--1959::యదుకుల కాంభోజి::రాగం



ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::T.చలపతి రావ్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల


యదుకుల కాంభోజి::రాగం  

(పహడి హిందుస్తానీ రాగం )

అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి
నిల్చెదవా గెల్చెదవా ఓహో చిన్నదానా

అడిగిందానికి చెపుతా ఎంతైనా పందెం గడతా
నిల్చెదనోయ్ గెల్చెదనోయ్ ఓహో చిన్నవాడా

ఒంటికాలిపై నుండి హఠ యోగ ముద్రలో నుండి (2)
గుట్టుగ తన పని సాధించునది వివరిస్తావా ఏదది

(అడిగిందానికి చెప్పి...)

ముక్కు మూరెడే యౌను అది కొక్కుకు మని గొణిగేను (2)
కొంగ జపమని ప్రసిద్ధియేను ముందుకు వచ్చి కాదను

(అడిగిందానికి చెపుతా...)

వాయువేగమును మించి లోకాలన్ని గాలించి (2)
గడియలోననే ఉన్న చోటికే వడిగా చేరేదేదది

(అడిగిందానికి చెప్పి...)

రాకెట్టని అనుకోను అది స్పూట్నిక్ అనలేను (2)
ముమ్మాటికి అది మనసేను ముందుకు వచ్చి కాదను

అడిగిందానికి చెపుతా..

దానమిచ్చి చెడెనెవ్వడు
కర్ణుడు
కర్ణుడు
తప్పు తప్పు బలి చక్రవర్తి
హే బలి చక్రవర్తి

జూదానికి నిపుణుండెవ్వడు
ధర్మజుడు
ధర్మజుడు
తప్పు తప్పు శకుని
హే శకుని

అన్నదమ్ముల పోరాటంలో సందు జూచుకొని కూల్చిందెవడు
భీముడు
భీముడు
తప్పు తప్పు రాముడు
హే రాముడు శ్రీ రాముడు శ్రీ రాముడు

No comments: