Director : Prakasha Rao T
సంగీతం::T.చలపతి రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జమున,రమణారెడ్డి,గుమ్మడి,రేలంగి,గిరిజ,
R.నాగేశ్వరరావు,C.S.R..ఆంజనేయులు
:::
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని బలే చిరాకా ఎందుకో?
తగని బలే చిరాకా.. ఆ......
నేడు శ్రీవారికి మేమంటే పరాకా!!
మొదట మొగవారు వేస్తారు వేషాలు
పెళ్ళి కాగానె చేస్తారు మోసాలు
ఆఅ....
ఆడవారంటే శాంత స్వరూపాలే
కోప తాపాలు రావండీ పాపం
కోరి చేరిన మనసు జేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు జేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
!! నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే బలే వినోదం ఎందుకో ?
తగువే బలే వినోదం......
నేడు శ్రీమతికి మాతోటి వివాదం !!వారి మనసైతే వస్తారు ఆడవారు
చేరరమ్మంటే రానే రారు
ఆఅ.......
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
అలుక సరదా మీకు అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే బలే వినోదం...ఆఅ....
నిజమే బలేవినోదం...ఆఅ.....
నిజమే బలే వినోదం.....నిజమే బలే వినోదం !!
No comments:
Post a Comment