Thursday, June 11, 2015

దొంగ--1985


సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,రాధ 

పల్లవి::

గోలీమార్ గోలీమార్..గోలీమార్ మార్ మార్ 
మార్ మార్..మార్ మార్  
కాష్మోర కౌగిలిస్తే..ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే..ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె..శృంగారమా 
వణుకుల్లో కూడ..ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 

చరణం::1

పుట్టంగానే మట్టైపోయే..కొత్త్తచట్టం వస్తే 
ముద్దుపెట్టాలంటే..అల్లాడి పోతావే అమ్మడూ 
బాణామతి చేస్తారు..ప్రాణాలింక తీస్తారు 
ఉన్న మతి పోయాక..ఉప్పుపాతరేస్తారు 
ఓ..ఇంతి బంతి పూబంతి..ఓ..శాంతి శాంతి ఓం శాంతి 
రుద్రం రౌద్రం రిరిమ్‌షా..మూర్ఖం మూఢం ముముర్‌షా 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్.. కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 

చరణం::2

ముట్టంగానే నిప్పైపోయే..కొరివి దెయ్యాలొస్తే 
కొంగులంటుకుంటే..చల్లారేదెట్టాగో ఇప్పుడూ 
చేతబడి చేస్తారో..కోడి మెడ కోస్తారో 
శ్మశానాల వీధుల్లపిశాచాలు పడతారో 
ఓ..నారీ ప్యారీ వయ్యారి..ఓ..భద్రా కాళి కంకాళి 
తీవ్రం తీండ్రం భిద్రుక్ష..ముందు వెనుక పరీక్ష 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్..కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్  
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 
కాష్మోర కౌగిలిస్తే..ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే..ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె..శృంగారమా 
వణుకుల్లో కూడ..ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్ 
గోలీమార్ గోలీమార్..మార్ మార్ మార్ మార్

దొంగ--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::చిరంజీవి,రాధ 

పల్లవి::

అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు..నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే..ఏ ఏ ఏ
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

చరణం::1

తెల్ల చీర ఇచ్చుకో..మల్లెపూల వేళలో
సన్నకాటుకిచ్చుకో..సందె చీకటేళలో
కదలి వచ్చే నీలో..కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే..కవితలెన్నో రాశా..ఆహాహా
కొత్త మోజుల..మత్తు గాలికి..సొగసు ఊపిరి..పోసుకున్నది
రాగాలెన్నో..నీలో రేగే వేళా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

చరణం::2

కొమ్మ రెమ్మ సందుల్లో..మావిళ్ళ విందులో
కోకిలమ్మ వీధుల్లో..రాగాల చిందులు
రామచిలకలు తెచ్చే..చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా..నీకు కానుక చేశా
మండు వేసవి..మల్లెలావిడి
పండు వెన్నెల..పడుచు ఊపిరి
నీలో నాలో..ఊయ్యాలూగే వేళా
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు..నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే..ఏ ఏ ఏ
అందమా అలా అలా..అల్లుకో ఇలా ఇలా

పెళ్ళీడు-పిల్లలు--1982




సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::Baapu 
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ..ఓ..ఓఓ..ఆ ఆలలలలా..ఆ
ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ.. 

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ.. 

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఊటికి పోటిగ ఆటైన..టినేజి ఉంది నీకూ
నీకైన నువుంటే ఘాటైన..లవ్ ఉంటే చాలు నాకూ

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

చరణం::1

ఇది వయసుకు వయసుకు..రేప్ 
ఇది వదిలితే రెండు గాప్ 
కమాన్ కమాన్ డాషింగ్ రోమాన్స్

నీ గుణమే..మనకొక పీస్ట్ 
నీ పరువం..పరుగే ఫాష్ట్ 
గొ ఆండ్ గొ..ఎవరొస్తారో..ఫష్టు..అహ్హా

ఫష్టు..గా..బెష్టు..గా మిస్సు గా లేటెష్టు గా  
ఫష్టు..గా..బెష్టు..గా మిస్సు గా లేటెష్టు గా 

రూల్స్ అన్ని గాలికి వదిలేయ్..నకరాలు మూలకు విసిరేయ్
రూల్స్ అన్ని గాలికి వదిలేయ్..నకరాలు మూలకు విసిరేయ్ 
మజా మజా ఈ రోజే..ఏ..మెహబూబా..ఆ

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

చరణం::2

నీ గుండెల సండడిలో..ఓ..అది చేసే తొందరలో
ఉండలేను వంటరి జంటగా..ఆ 

నే దొరికిన సమయంలో..నీ తూపుల దూకుడులో
ఉండలేను నీతో ఒంటరిగా..ఆ

నా కోసమేమైన చేస్తావా..??..మ్మ్ 
కొండ నుంచి దూకమంటే దూకుతావా..?..ఓ..షూర్ 
సింగింగ్..?
మాప మాప మాగరిస రీగ రీగ రీ..ఈ
డన్సింగ్ ?
తకిట తకిట తకిట తకిట తకిట తకిట తా..ఆ
లెడ్డింగ్..రెడి..
కిస్సింగ్..ఓకె..ఆ ఆ ఆ ఆ
నననననననన..అలాంటి ఇలాంటి అమ్మాయ్‌కాదిది   
అల్లాటప్పాపిల్లకాదిది 
అలాంటి ఇలాంటి అమ్మాయ్‌కాదిది..అల్లాటప్పాపిల్లకాదిది  
వెర్రిమొర్రి వేషాలేస్తే..గూబ గుయ్యిమంటది
ఒకె..ఒకె..ఒకె..ఒకె..

ఉండి ఉండి గుండెవచ్చి..గొంతులోన కొట్టుకాడి
లవ్‌సాంగ్ పాడిందిరో..ఓ..

ఆ..వెంటపడ్డ జంటకాస్త..ఇంటికొచ్చి పంటకొచ్చి
లవ్‌స్టోరి రాసిందిరో..ఓ

Pelleedu-Pillalu-1982
Music::M.S.Viswanath
Lyrics::Acharya-Atreya
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::Baapu 
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.

::::::::::::::::::::::::::::

aa aa aa aa aa..O..OO..aa aalalalalaa..aa
unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O.. 

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O.. 

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

UTiki pOTiga ATaina..TinEji undi neekuu
neekaina nuvunTE ghaaTaina..lav unTE chaalu naakuu

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

::::1

idi vayasuku vayasuku..rEp 
idi vadilitE renDu gaap 
kamaan kamaan Daashing rOmaans

nee guNamE..manakoka peesT 
nee paruvam..parugE faashT 
go aanD go..evarostaarO..fashTu..ahhaa

fashTu..gaa..beshTu..gaa missu gaa lETeshTu gaa  
fashTu..gaa..beshTu..gaa missu gaa lETeshTu gaa 

rools anni gaaliki vadilEy..nakaraalu moolaku visirEy
rools anni gaaliki vadilEy..nakaraalu moolaku visirEy 
majaa majaa ii rOjE..E..mehaboobaa..aa

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

::::2

nee gunDela sanDaDilO..O..adi chEsE tondaralO
unDalEnu vanTari janTagaa..aa 

nE dorikina samayamlO..nee toopula dookuDulO
unDalEnu neetO onTarigaa..aa

naa kOsamEmaina chEstaavaa..??..mm 
konDa nunchi dookamanTE dookutaavaa..?..O..shoor 
singing..?
maapa maapa maagarisa reega reega rii..ii
Dansing ?
takiTa takiTa takiTa takiTa takiTa takiTa taa..aa
leDDing..reDi..
kissing..Oke..aa aa aa aa
nananananananana..alaanTi ilaanTi ammaay^kaadidi   
allaaTappaapillakaadidi 
alaanTi ilaanTi ammaay^kaadidi..allaaTappaapillakaadidi  
verrimorri vEshaalEstE..gooba guyyimanTadi
oke..oke..oke..oke..

unDi unDi gunDevachchi..gontulOna koTTukaaDi
lav^saang paaDindirO..O..

aa..venTapaDDa janTakaasta..inTikochchi panTakochchi
lav^sTOri raasindirO..O

Wednesday, June 10, 2015

తొలి కోడి కూసింది--1981



సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::శరత్‌బాబు,సరిత,సీమ,జీవ,

పల్లవి::

ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ..నవ్వాను మైమరచి

పైటకు పొగరెక్కి..ఎగిరిందిరోయ్
పరువం నునుపెక్కి..మెరిసిందిరోయ్
ఆ సోకంత చూశాక..ఒళ్లు జల్లుమన్నది  
కళ్ళు జిగేల్ మన్నవి..తస్సాదియ్యా
చాకల్లే నీ చూపు..అహ దూసిందబ్బీ
అది నా గుండెలో..గాయం చేసిందమ్మీ 
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ..నవ్వాను మైమరచి

చరణం::1 

పావడ ఓణీలో..నిను చూస్తినీ
ప్రాయం రాలేదు..అనుకొంటిని
చిగురాకుళ్లో సిరిమల్లె..నినడిగి పూయదు 
నీతోటి చెప్పదు..తస్సాదియ్యా
అహ..నాకోసం కాకుంటే ఆ కోకెందుకు
కోకుంటే చాలంటే..ఇక నేనెందుకు    
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి

చరణం::2

నిద్దరలో నన్ను..నువు చూస్తివి
ముద్దులు పక్కంత..కురిపిస్తివి
అది నీకెట్ట తెలిసింది ఎగిరొచ్చి ఓ ముద్దు 
బుగ్గ మీద పడ్డదా..తస్సాదియ్యా 
అది నీకెట్ట తెలిసింది..ఎగిరొచ్చి ఓ ముద్దు 
బుగ్గ మీద పడ్డదా..తస్సాదియ్యా  
స్వప్నాలు నిజమైతే..అది స్వర్గాలబ్బీ
నువ్వు ఊ అంటే..స్వర్గాలు సొంతాలమ్మీ

ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి..నవ్వాను మైమరచి

తొలి కోడి కూసింది--1981



సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.జానకి

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అందమయిన లోకమని..రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు..రామ రామా..ఆ
అంత అందమైంది కానే కాదు..చెల్లెమ్మా..చెల్లెమ్మా
అందమైంది కానేకాదు చెల్లెమ్మా..ఆ

అందమయిన లోకమని..రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు..రామ రామా 
అంత అందమైంది కానే కాదు..చెల్లెమ్మా..చెల్లెమ్మా
అందమైంది కానేకాదు చెల్లెమ్మా..ఆ

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా..ఆ
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా..రామ రామా  
ఆశలకి అంతముందా చెప్పమ్మా..చెల్లెమ్మా
ఆశలకి అంతముందా..చెప్పమ్మా..ఆ

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా  
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..ఆ

చరణం::1

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది..పాలు తాగి మనిషి విషమౌతాడు..
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది..పాలు తాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్ప తనమా..ఆ..ఇది పాల దోష గుణమా..ఆ
అది గడ్డి గొప్ప తనమా..ఇది పాల దోష గుణమా..ఆ
మనిషి చాల దొడ్డాడమ్మా చెల్లెమ్మ..చెల్లెమ్మా
తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..ఆ
అందమయిన లోకమని..రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు..రామ రామా..ఆ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..ఆ

చరణం::2

ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి..మొగలిపువ్వులోన నాగుంటాది
ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి..మొగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగూ..ఊ..ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా..చెల్లెమ్మా
లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా..ఆ
అందమయిన లోకమని..రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..ఆ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..ఆ

చరణం::3

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా..పేదవాడు నాడే పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా..పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ..ఊ..ఈ పేదను తిననివ్వడూ..ఊ
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా..ఆ

అందమయిన లోకమని..రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామా..ఆ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..ఆ
చెల్లెమ్మా..ఆ..అందమైంది కానేకాదు చెల్లెమ్మా..ఆ

పెళ్ళీడు-పిల్లలు--1982



 
సంగీతం::M.S.విశ్వనాథన్ 
రచన::శ్రీ శ్రీ 
గానం::P.సుశీల
Film Directed By::Baapu 
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ

పల్లవి::

పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం

పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం

పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం..మ్మ్

పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం

చరణం::1

లైలా..ఆ ఆ ఆ..లైలా..ఆ ఆ ఆ ఆ 
మజునూ..ఊ ఊ ఊ..మజునూ..ఊ ఊ ఊ 
లైలా..మజును..దేవదాసులా ఆలా చెల్లిపోయిందీ
జులీ..బాబీ..లవ్..నిలిచేకాలం వచ్చింది 
నువ్వూ నేనూ ఒకటై..వెలిగే కాలం వచ్చిందీ

పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం..మ్మ్

చరణం::2

పూవూ తావి వేరైవుండవు..వెన్నెల చంద్రుని విడిపోదూ
పూవూ తావి వేరైవుండవు..వెన్నెల చంద్రుని విడిపోదూ
పెద్దలు ప్రేమకు అడ్డంపడితే..పిన్నలు పాఠం చెపుతారు 
మనసులేకమై నిలుచువారలకు..చేతికందగలదాకాశం  
గడుపుమాని ముందడుగుగు వేయమని..యువతరానికిది సందేశం

పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం..మ్మ్

Pelleedu-Pillalu-1982
Music::M.S.Viswanath
Lyrics::Sree Sree
Singer's::P.Suseela
Film Directed By::Baapu 
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.

::::::::::::::::::::::::::::

paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam

paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam

parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam..mm

paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam

::::1

lailaa..aa aa aa..lailaa..aa aa aa aa 
majunuu..uu uu uu..majunuu..uu uu uu 
lailaa..majunu..dEvadaasulaa Alaa chellipOyindii
julii..baabii..lav..nilichEkaalam vachchindi 
nuvvuu nEnuu okaTai..veligE kaalam vachchindii

paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam..mm

::::2

poovuu taavi vEraivunDavu..vennela chandruni viDipOduu
poovuu taavi vEraivunDavu..vennela chandruni viDipOduu
peddalu prEmaku aDDampaDitE..pinnalu paaTham cheputaaru 
manasulEkamai niluchuvaaralaku..chEtikandagaladaakaaSam  
gaDupumaani mundaDugugu vEyamani..yuvataraanikidi sandESam

paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam..mm

నేటి సిధ్ధార్థ--1990


సంగీతం::లక్ష్మీకాంత్-ప్యారేలాల్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::నాగార్జున,శోభన 

పల్లవి::

ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ లలల లాలల లాలలా
ఓసి మనసా..నీకు తెలుసా
మూగకనులా..ఈ గుసగుసా
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి
ఈ లావాదేవీ ఏనాటిదీ..ఓ ఓ హో హో

ఓసి వయసా..ఇంత అలుసా
నీకు తగునా..ఈ గుసగుసా
మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ గిల్లీకజ్జా ఏనాటిదీ..ఓహొహో హో
ఓసి మనసా..నీకు తెలుసా

చరణం::1

నింగీ నేలా వంగీపొంగీ సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండినా సందెలో
కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడినా చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
కసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకే
సిరితీగ పాప ఉగేది తీపి కాటుకే
అహా ప్రేమో ఏమో ఈలాహిరీ..ఓహొహో హో
ఓసి వయసా..ఇంత అలుసా

చరణం::2

తుళ్ళి తుళ్ళి తూనీగాడె పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా పూలలో తావిలా
హొయ్ మల్లీ జాజీ మందారాల పుప్పొళ్ళాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిలా రాగమే తీయగా
ఒడిలో అలజడులే పెరిగే వేళలో
కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాకా ఇంతేమరీ..ఆహహా హా

ఓసి మనసా..నీకు తెలుసా..హో
నీకు తగునా..ఈ గుసగుసా
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ లావాదేవీ ఏనాటిదీ..ఓహొహో హో 
ఓసి వయసా..ఇంత అలుసా 
ఓసి మనసా..నీకు తెలుసా 

సొమ్మొకడిది సోకొకడిది--1979



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కమల్‌హాసన్,జయసుధ,రోజారమణి.

పల్లవి::

ఆ పొన్న నీడలో..ఈ కన్నె వాడలో..ఉన్నా..వేచి ఉన్నా
కదలి రావేలనే..నా అన్నులమిన్న
కదలి రావేలనే..నా అన్నులమిన్న

రేపల్లె వాడలో..గోపెమ్మ నీడలో..వెన్నా..దోచుకున్నా
కథలు విన్నాను లేరా..అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా..అల్లరి కన్నా 

చరణం::1

రాధమ్మ మనసు..రాగాలు తెలుసు
అది తీపి కోపాల..వయసూ
ఆ ఆ ఆ ఆ ఆ
కన్నయ్య వయసూ..గారాలు తెలుసు
అది మాయ..మర్మాల మనసూ
అల్లరి ముద్దు..హద్దులు వద్దు
ఇద్దరమంటె..ముద్దుకు ముద్దు
ఆ..అల్లరి ముద్దు..హద్దులు వద్దు
ఇద్దరమంటె..ముద్దుకు ముద్దు
పదహారువేల..సవతులు వద్దు
ఆ ఆ..పదహారు వేల సంకెళ్లు వద్దు

ఆ పొన్న నీడలో..ఈ కన్నె వాడలో..ఉన్నా..ఆ..వేచి ఉన్నా
కదలి రావేలనే..నా అన్నులమిన్న
కదలి రావేలనే..నా అన్నులమిన్న

రేపల్లె వాడలో..గోపెమ్మ నీడలో..వెన్నా..ఆహా..దోచుకున్నా
కథలు విన్నాను లేరా..అల్లరి కన్నా
కథలు విన్నాను లేరా..అల్లరి కన్నా 

చరణం::2

ఈ రాసలీల..నీ ప్రేమ గోల..ఎవరైనా చూసేరీ వేళా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఈ మేనులోన..నా ప్రేమ వీణ..సరిగమలే వింటానీ వేళా
వేసవి సోకు..వెన్నెల కాపు..ఆశలు రేపు..బాసలు ఆపు
వేసవి సోకు..వెన్నెల కాపు..ఆశలు రేపు.. బాసలు ఆపు
కలహాలు పెంచే..కౌగిలి ముద్దు
ఈ కలహాలు..పెంచే కవ్వింత ముద్దు

ఆ పొన్న నీడలో..ఈ కన్నె వాడలో..ఉన్నా..వేచి ఉన్నా
కదలి రావేలనే..నా అన్నులమిన్న
కదలి రావేలనే..నా అన్నులమిన్న

ఆ పొన్న నీడలో..ఈ కన్నె వాడలో..ఉన్నా..వేచి ఉన్నా
కదలి రావేలనే..నా అన్నులమిన్న
కదలి రావేలనే..నా అన్నులమిన్న
ఆహాహ ఆహా లాలలలాల..ఆహాహ ఆహా లాలలలాల 

సొమ్మొకడిది సోకొకడిది--1979



సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు
తారాగణం::కమల్‌హాసన్,జయసుధ,రోజారమణి.

పల్లవి::

ఆకాశం నీ హద్దురా..హెయ్..హెయ్..తరప్తరప్తర
అవకాశం...వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో..హమేషా..తమషా..చెయ్యరా
హా..ఆకాశం నీ హద్దురా. అవకాశం వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో..హమేషా..తమషా..చెయ్యరా
హమేషా..తమషా..చెయ్యరా
ఆకాశం నీ హద్దురా..అవకాశం వదలొద్దురా

చరణం::1

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా..మబ్బుల్లో మెరుపంతా నీదిరా
నిలబడి తాగే నీళ్ళు చేదురా..పరుగెత్తయినా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవాలురా..ప్రపంచమే మాయాబజారురా
ప్రపంచమే మాయాబజారురా

హోయ్..గురిచూసి కొట్టాలిరా..సిరి చూసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే..ఎత్తులు..జిత్తులు..వెయ్యరా
ఎత్తులు..జిత్తులు..వెయ్యరా
ఆకాశం నీ హద్దురా..అవకాశం వదలొద్దురా

చరణం::2

నుదుటి రాత నువ్వు మార్చి రాయరా..నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకున్నది పొందడమే నీతిరా..మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జన్మ మరువలేని ఛాన్సురా..ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా

హా..సుడిలోకి దూకాలిరా..కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే..తడాకా..మజాకా..చూపరా
తడాకా..మజాకా..చూపరా

హా..ఆకాశం నీ హద్దురా..అవకాశం వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో..హమేషా..తమషా..చెయ్య

బంగారు బుల్లోడు--1993



సంగీతం::రాజ్-కోటి
రచన::వేటూరి
గానం::బాలు,చిత్ర

పల్లవి::

వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా..వాగు వంకా మెచ్చేనంటా..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ 

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో...
అందా..లెన్నో..యాలో..ఓ..ఓ..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

చరణం::1

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు..ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా..వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా..కాదయ్యో నీ గొప్పా
నీలో..మేఘం..నాలో దాహం..యాలో..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

చరణం::2

వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట

ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ..ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా..ముద్దేలే జేగంట
నాలో..రూపం..నీలో తాపం..యాలో..యాల
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా
అల్లో మల్లో
అందా..లెన్నో
యాలో..ఓ..ఓ..యాల
వానా వానా వచ్చేనంట..వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట..తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా..కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి..పరవళ్ళెత్తి పరిగెత్తంగా