సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శరత్‌బాబు,సరిత,సీమ,జీవ,
పల్లవి::
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ..నవ్వాను మైమరచి
పైటకు పొగరెక్కి..ఎగిరిందిరోయ్
పరువం నునుపెక్కి..మెరిసిందిరోయ్
ఆ సోకంత చూశాక..ఒళ్లు జల్లుమన్నది
కళ్ళు జిగేల్ మన్నవి..తస్సాదియ్యా
చాకల్లే నీ చూపు..అహ దూసిందబ్బీ
అది నా గుండెలో..గాయం చేసిందమ్మీ
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ..నవ్వాను మైమరచి
చరణం::1
పావడ ఓణీలో..నిను చూస్తినీ
ప్రాయం రాలేదు..అనుకొంటిని
చిగురాకుళ్లో సిరిమల్లె..నినడిగి పూయదు
నీతోటి చెప్పదు..తస్సాదియ్యా
అహ..నాకోసం కాకుంటే ఆ కోకెందుకు
కోకుంటే చాలంటే..ఇక నేనెందుకు
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి
చరణం::2
నిద్దరలో నన్ను..నువు చూస్తివి
ముద్దులు పక్కంత..కురిపిస్తివి
అది నీకెట్ట తెలిసింది ఎగిరొచ్చి ఓ ముద్దు
బుగ్గ మీద పడ్డదా..తస్సాదియ్యా
అది నీకెట్ట తెలిసింది..ఎగిరొచ్చి ఓ ముద్దు
బుగ్గ మీద పడ్డదా..తస్సాదియ్యా
స్వప్నాలు నిజమైతే..అది స్వర్గాలబ్బీ
నువ్వు ఊ అంటే..స్వర్గాలు సొంతాలమ్మీ
ఎప్పుడో ఏదో చూచి..ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి..నవ్వాను మైమరచి
No comments:
Post a Comment