Wednesday, June 10, 2015

నేటి సిధ్ధార్థ--1990


సంగీతం::లక్ష్మీకాంత్-ప్యారేలాల్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::నాగార్జున,శోభన 

పల్లవి::

ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ లలల లాలల లాలలా
ఓసి మనసా..నీకు తెలుసా
మూగకనులా..ఈ గుసగుసా
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి
ఈ లావాదేవీ ఏనాటిదీ..ఓ ఓ హో హో

ఓసి వయసా..ఇంత అలుసా
నీకు తగునా..ఈ గుసగుసా
మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ గిల్లీకజ్జా ఏనాటిదీ..ఓహొహో హో
ఓసి మనసా..నీకు తెలుసా

చరణం::1

నింగీ నేలా వంగీపొంగీ సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండినా సందెలో
కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడినా చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
కసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకే
సిరితీగ పాప ఉగేది తీపి కాటుకే
అహా ప్రేమో ఏమో ఈలాహిరీ..ఓహొహో హో
ఓసి వయసా..ఇంత అలుసా

చరణం::2

తుళ్ళి తుళ్ళి తూనీగాడె పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా పూలలో తావిలా
హొయ్ మల్లీ జాజీ మందారాల పుప్పొళ్ళాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిలా రాగమే తీయగా
ఒడిలో అలజడులే పెరిగే వేళలో
కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాకా ఇంతేమరీ..ఆహహా హా

ఓసి మనసా..నీకు తెలుసా..హో
నీకు తగునా..ఈ గుసగుసా
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ లావాదేవీ ఏనాటిదీ..ఓహొహో హో 
ఓసి వయసా..ఇంత అలుసా 
ఓసి మనసా..నీకు తెలుసా 

No comments: