Friday, March 09, 2012

యుగంధర్--1979




సంగీతం::ఇళయరాజ
రచన::సినారె
గానం::S.P.బాలు

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
ఇంతకు నేను ఎవరో తెలుసా...
నా..ఆ..పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగంధర్..

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
ఇంతకు నేను ఎవరో తెలుసా...
నా..ఆ..పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగంధర్..

చరణం::1
లలాలలలాలలలలాలలలా

మీరంత చూసేది నన్ను కాదు..ఈ ఊరంత అనుకునేది నేను కాదు
మీరంత చూసేది నన్ను కాదు..ఈ ఊరంత అనుకునేది నేను కాదు
మంచికే మంచినీ..మనిషిలో మనిషిని
ఏ..ఎదలో ఏముందో..ఏ..పొదలో ఏముందో.
పసికట్టి పట్టేస్తా..బుసగొట్టి కాటేస్తా..
నా పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్..

లాల లాల లల్లలా లల్లలా లల్లలా లా లా లా లా లా లల్లాల లల్లాల.
నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు
నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు
మంచికే మంచినీ..మనిషిలో మనిషినే

ఏ వేషం వేస్తానో..ఏ వేళ వస్తానో..
ఎదురొస్తే ఏరేస్తా..ఏదైనా సాదిస్తా..
నా పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్.

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
ఇంతకు నేను..అహ్హ..ఎవరో తెలుసా...
నా..ఆ..పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగంధర్..

Thursday, March 08, 2012

రాముడే దేవుడు--1973

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4544
సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ  

పల్లవి::

ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ
అవి జతగానే బతకాలని..కలగంటు వున్నాయి 
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు..గువ్వలూ

చరణం::1

చూపులేనిదానికొకటి..కాపువున్నదీ
తోడులేని దాని కొకటి..జోడైనదీ
జంటగువ్వ వెంటవుంటే..పొంగిపోతదీ
ఒక్క క్షణం దూరమైతే..కుంగిపోతదీ
అది ఏనాటి బంధమో..అరెంటిని కలిపిందీ      
ఒకే తోటలోన..ఒక గూటిలోన  
చేరాయి రెండు...గువ్వలూ 
చేరాయి రెండు...గువ్వలూ

చరణం::2

తనువులేమొ వేరైనా..మనసు ఒక్కటే
గుండెలేమొ రెండైన..ప్రాణమొక్కటే
ఎక్కడ అవి పుట్టాయో..తెలియదెవరికి
ఒక్కటిగా బతకడమే..తెలుసువాటికీ
తమ చిన్నారి ఆగూడే..కోవెలగా తలచాయి     
ఒకే తోటలోన..ఒక గూటిలోన
చేరాయి రెండు...గువ్వలూ
చేరాయి రెండు...గువ్వలూ

చరణం::3

పూలమాలలో దారం..దాగివుంటదీ  
వలపుజంటలో చెలిమి...దాగనంటదీ
కలిసి మెలిసి కధలెన్నో..అల్లుకున్నవీ   
అంతులేని ఆశలెన్నో..పెంచుకున్నవీ
తన చెలికాడే దేవుడని..మనసార తలచిందీ      
ఒకే తోటలోన..ఒక గూటిలోన  
చేరాయి రెండు...గువ్వలూ  
చేరాయి రెండు...గువ్వలూ

Wednesday, March 07, 2012

మాతౄ దేవత--1969




సంగీతం::K.V.మహాదేవన్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,B.వసంత
దర్శకత్వం::సావిత్రి
నిర్మాత::అట్లూరి పూర్ణచంద్రరావు,M.చంద్రశేఖర్‌‌
నటీనటులు::సావిత్రి, ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు, చంద్రకళ, నాగభూషణం, రేలంగి, హేమలత, బేబిరాణి, రాజబాబు, మంజుల, సురభి బాలసరస్వతి, విజయలలిత, సాక్షి రంగారావు


మహిళాదినోత్సవం సందర్బంగా,

మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ

|| మానవ జాతి ||

ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల వల్లి
ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి
ఆ ఆ ఆ....ఓ..ఓ.....

మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ

సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది

మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
మెల్లగా కవితలల్లగా తేనేజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకునది

మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ

తరుణి పెదవిపై చిరునగ వొలికిన మెరయును ముత్యాల తరులు
కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవు ఆ సిరులు
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
కన్న కడుపున చిచ్చురగిలెనా కరువుల పాలౌను దేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
ఆ...ఆ...ఆ...ఓ ఓ...

మానవ జాతి మనుగడకె ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరగని పెన్నిధి మగువ

విజృంభణ--1986









సంగీతం::సత్యం
నిర్మాతలు::కోనేరు రవీంద్రనాథ్,పాలపర్తి కోటేశ్వరరావు
దర్శకత్వం::రాజాచంద్ర
సంస్థ::విజయశ్రీ ఆర్ట్స్
గాత్రం::బాలు, చిత్ర (తొలి పాట)
తారాగణం::శోభన్బాబు, జయసుధ, శోభన, సీత

హిందిలో "Merijung"అనిల్‌కపూర్ హిరోగా
తెలుగులో "విజ్రుంభణ" శోభన్ హిరోగా నటియించిన
ఈ సినిమా పాటలు అన్నీ బాగున్నాయి
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దైర్యంతో
ముందుకు వెళ్ళి విజయం సాధించాలనే నిజాన్ని చెప్పే
పాట ఇది హింది,తెలుగులో రెండింటిలోనూ ఈ పాట చాలా బాగుంటుంది
మీరూ వినండి

పల్లవి:

గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం1:

కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడబడక వడి వడిగా నడిచేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం2:

చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా
ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం...జీవితం
ప్రతిపదం...ప్రతిపదం సమరమై సాగనీ

త్రిమూర్తులు--1987


















సంగీతం::బప్పీలహరి
రచన::
దర్శకత్వం::K.మురళిమోహన్‌రావ్
నిర్మాత::శశిభూషణ్
గానం::బాలు,సుశీల
సంస్థ::మహేశ్వరీ,పరమేశ్వరీ ప్రొడక్షన్స్

పల్లవి::

ఓ ఓ ఓ ఓ శీతాకాలం శృంగారాలు
సాయంకాలం సంగీతాలు
పులకింతల పూదోటలో
కవ్వింతల కాపురం పెట్టుకుందామా చుట్టుకుందామా

చరణం::1

గోరంత నీ ముద్దు తాకే గోరింట నా నోట పండే
నా ఈడూ సూరీడులాగ ఎండెక్కే వేడిలో
కొండంత నీ ఎత్తు చూసా కోనంటి నీ లోతు చూసా
నీ ఎత్తులే చిత్తు చేసే కౌగిట్లో వాలనా
కసి కట్నమే చదివించనా కానిస్తే ఆ లాంచనం
రెచ్చిపోదామా రేగిపోదామా

చరణం::2

రెండితల బంతులాట రేయంత పూబంతులాట
చెక్కిళ్ళ చేమంతులాట ఆడిస్తా వాటంగా హోయ్
కూసంత నడుమిచ్చుకుంటా పువ్వంత మనసిచ్చుకుంటా
నీ సొంతమై తోడు ఉంటా అన్నిట్లో జంటగా
చలిమంటలే రగిలించనా సయ్యాటతో ఈ దినం
వద్దు అంటానా, అంటే వింటానా

Tuesday, March 06, 2012

దొరలు దొంగలు--1976



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4784

సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

హేయ్..వెడలె..ఉత్తరాకుమారి సభకు..రాయంటి నడకల
వెడలె..ఉత్తరాకుమారి సభకు
వంది మాగదులు చిందులు తొక్కగ 
వంది మాగదులు చిందులు తొక్కగ
ఆయ్..వంది మాగదులు చిందులు తొక్కగ 
వంది మాగదులు చిందులు తొక్కగ 
కుందర ఘన కను విందుసేయుచు
వెడలె..ఉత్తరాకుమారి సభకు..ఉత్తరాకుమారి సభకు 
రాయంటి నడకల వెడలె..ఉత్తరాకుమారి సభకు
వెడలె..ఉత్తరాకుమారి సభకు..ఆపండీ   
::::
ఇలా ఉత్తరాకుమారి నిద్రనుండి లేచి 
కళ్ళు తేరచి...ఓళ్ళు విరచి
బృహన్నల కడ నేర్చిన...నాట్యవిధానం 
బెట్టిదనినా ఎట్టిదనినా..ఆఆ..శభాష్    
తకిటా..తకతకిట ధిమిత తక తకిటా 
ధిమి తకిట తకిట తోం...తకిటా
తకతకిట ధిమిత తక..తకిటా 
ఉప్పు కప్పురం ఒకటిగ వున్నాఉప్పు 
కప్పురం ఒకటిగ వున్నా ఉప్పు కప్పురం ఒకటిగ వున్నా
రుచుల జాడ వేరన్నాఇది వేదవాక్కు రోరన్నా
తకిటా..ఓహో..తకత కిట ధిమిత తక తకిటా ధిమి తకిట 
తకిట తోం తకిటా తకత కిట ధిమిత తక తకిటా

చరణం::1

కన్ను ముక్కు కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా 
కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా..కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా
కాళ్ళ తీరు వేరన్న..ఈ కాళ్ళ కాళ్ళ తీరు వేరన్న 
ఆ కాళ్ళు మాకు...తెలుసన్న 
తకిటా..ఆహా..తకతకిట ధిమిత తక తకిటా ధిమి తకిట 
తకిట తోం తకిటా తకతకిట ధిమిత తక తకిటా..ఆ

చరణం::2

చేతులా ఇవి అయ్యో చేతులా ఇవి ఆ చేతులా ఇవి..అహా 
చేతులా ఇవి భూతలమ్మున ఖ్యాతి గాంచిన రాతి రేకులు 
చూడవే ఓ ముద్దుగుమ్మా చూడవే 
అహ చూడవే ఓ ముద్దుగుమ్మా చూడవే 
చూసితీ నీకంటే ముందే చూసితీ 
ఒహో చూసితీ నీకంటే ముందే చూసితీ
చూసి చేసేదేమి లేదని చూసి చేసేదేమి 
లేదని చూసి చూడని దాననైతిని    
తకిటా తకతకిట ధిమిత తక తకిటా ధిమి తకిట తకిట 
తోం తకిటా తకతకిట ధిమిత తక తదిగినతోం తదిగినతోం

Monday, March 05, 2012

చిననాటి స్నేహితులు--1971

సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,జగ్గయ్య,దేవిక,శోభన్‌బాబు,వాణిశ్రీ.

పల్లవి::

ఏమని తెలుపనురా..స్వామీ
ఏమని తెలుపనురా..ఏమని తెలుపనురా  
తొలిచూపులోనే..ఏ గిలిగింతలాయెనో
తొలిచూపులోనే..ఏ గిలిగింతలాయెనో 
ఏమని తెలుపనురా..ఏమని తెలుపనురా 

చరణం::1

చిననాటి కథలేవో తెలిపీ..చేయి కలిపీ
కొనగోట నునుబుగ్గ మీటీ..కన్ను గీటీ
చెమరించు నామేను చిరుగాలివలె తాకి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చెమరించు నామేను చిరుగాలివలె తాకి
మనసు తెలిసి..మరులు కురిసి
కన్నియ మది..కరగించిన గడసరివని
ఏమని ఏమని.. ఏమని..ఇంకేమనీ తెలుపనురా
ఏమని తెలుపనురా..ఏమని తెలుపనురా

చరణం::2

యెదలోని పొదరింటచేరీ..నన్నే కోరీ
పదునైన తలపేదోరేపీ..ఆశ చూపీ
రసలోక శిఖరాల..కొసలేవొ చూపించి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రసలోక శిఖరాల.. కొసలేవొ చూపించి 
ఏమనందు ఇంకముందు..కేరింతలు పులకింతల తేలింతూ  
ఏమని ఏమని..ఏమని ఇంకేమనీ తెలుపనురా
ఏమని తెలుపనురా..ఏమని తెలుపనురా

స్వయంవరం--1982



సంగీతం::సత్యం  
రచన::రాజశ్రీ  
గానం::S.P.బాలు,P.సుశీల  

పల్లవి::

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ 
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ 
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ
రారమ్మని పిలిచే పైబడీ 

చరణం::1

పసుపుపచ్చ లోగిలిలో..పసుముకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలిలో..పసుబార బోసినట్టు
పాదాల పారాణి అద్దినట్టూ..పాదాల పారాణి అద్దినట్టూ 
నుదుటిపై కుంకుమా..దిద్దినట్టూ 
ఆకాశం ఎందుకో..పచ్చబడ్డదీ 
ఆ నడుమ..బొట్టేమో ఎర్రబడ్డదీ 

చరణం::2

పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి..పోసినట్టూ 
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి..పోసినట్టూ
కర్పూరం హారతీ..ఇచ్చినట్టూ
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ
రారమ్మని పిలిచే..పైబడీ..ఈ 
ఆకాశం ఎందుకో..పచ్చబడ్డదీ
ఆ నడుమ..బొట్టేమో ఎర్రబడ్డదీ

Sunday, March 04, 2012

ఆరాధన--1987


సంగీతం::ఇళయ రాజ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి


తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాట మేనా
మమత కలబోసిన మాట కరువేనా

తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా..ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా..అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా..అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొద్దు కుదిరేదా
ప్రేమ కన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరుపేగా

కలలో మెదిలిందా ఇది కథలో జరిగిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదౌనా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా చేయి చేయి కలిపేనా


తీగనై మల్లెలూ పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసిన మోమాట మేన
మమత కలబోసిన మాట కరువేనా

Thursday, March 01, 2012

హిట్లర్--1997




సంగీతం::కోటి
రచన::వేటూరి
గానం::S.P.బాలు , చిత్ర


నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నా మేస్త్రీ
నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీరా నా మేస్త్రీ

హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ


అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు
జివ్వుమన్న రవ్వలడ్డు హో హో హో హో
ఆభ్ఛ్ లో లేని Z ఏపుగున్న బుగ్గ రెడ్డు లేతగున్న నీటిబొట్టు హో హో హో
అలకా కులుకూ ఎప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే
పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
అలకా కులుకూ ఎప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే
పలకా బలపం లవ్వు లవ్వు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
తనువే పలికే కసి ఖవాలి నరమే ఉలికే ఎద మనాలి
తెరలే తెరచి పద తెనాలి పదవే పొదకే పసి మరాళి
హబిబీ హబిబీ హబిబీ హబిబీ హబిబీ హబిబీ


నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి

రాజమండ్రి రేవుకాడా రంగసాని మేడకాడ రాతిరేళ రవ్వదంట
నాయూడోరి ఇంటికాడ నల్లతుమ్మ సెట్టు నీడ ఎన్నెలంతా ఎంకిదంట
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందెవెస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నె తీగ పూలు పిందెవెస్తుంటే
వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జత జవానీ పరువం పలికే ప్రియ భవాని
తొలిగా పడితే చెలి నిషాని జరిగే జతులే యమ కహాని
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి
ఒంపు సొంపుల యంగోత్రీ కాలు జారకే కంగోత్రి
హబిబీ హబిబీ హబిబీ హాబీబీ
హే హబిబీ హబిబీ హబిబీ హాబీబీ