Showing posts with label దొరలు దొంగలు--1976. Show all posts
Showing posts with label దొరలు దొంగలు--1976. Show all posts

Tuesday, March 05, 2013

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4786
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

పండు వెన్నెల తెల్లవార్లు కురిసి వెలిసింది 
పైట సర్దుక పల్లెటూరు నిదుర లేచింది నిదురలేచింది

పొంచి కూర్చొని ఉన్న సూర్యుడు పైకి లేచాడు 
ముగ్గుల ముంగిళ్ళు చూసి మురిసి పోయాడు మురిసి పోయాడు

అందాల చందాల చందమామ మా ఇంట వెలిసావ చందమామా 
అందాల చందాల చందమామ మా ఇంట వెలిసావ చందమామా

ఓ ముప్పేట గోలుసురో చందమామా 
అహ ముప్పేట గొలుసురో చందమామా
ఇది మూడు తరాలుండాలి చందమామా 
ఇది మూడు తరాలుండాలి చందమామా
చందమామా ఆ చందమామా చందమామా ఆ చందమామా

Tuesday, February 05, 2013

దొరలు దొంగలు--1976



సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి

పల్లవి::

చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
కల్లాకపటం తెలియని నన్ను..కన్నులతో కవ్వి౦చవద్దని 
చెప్పాలనుకున్నానూ..చెప్పలేకపోతున్నానూ
చెప్పకుండ...నా మదిలో దూరి
చిందర వందర చెయ్యొద్దని..రె౦డివ్వాలనుకున్నానూ  
రె౦డివ్వాలనుకున్నానూ..ఇవ్వలేక పోతున్నానూ

చరణం::1

ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
ఆడుకునే లతల నడుమ..పాడుకునే పూవులమై
పరిసరాల నన్నిటిని..పరిమళింప చేద్దామని
పరిమళింప చేద్దామని..నే చెప్పాలనుకున్నానూ చెప్పలేకపోతున్నానూ

చరణం::2

మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
మేలి ముసుగులోని లజ్జ..మెట్లు దిగీ వచ్చిందని
తెలిసికుడా తెలియనట్లే..ఒదిగుంటే ఒళ్ళుమండి
ఒదిగుంటే ఒళ్ళుమండి..రె౦డివ్వాలనుకున్నానూ
ఇవ్వలేక...పోతున్నానూ

చరణం::3

అడగకుండ అందించే..ఆలి౦గన మధురము
అడగకుండ అందించే..ఆలి౦గన మధురము 
అహా..వద్దంటూ అందుకునే..వలపు మరీ మధురము
అని చెప్పాలనుకున్నాను..అన్నీ చెప్పేశాను
ఇవ్వాలనుకున్నాను..అన్నీ ఇచ్చేశాను

Saturday, April 07, 2012

దొరలు దొంగలు--1976



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4788
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను
ఆడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట
ఆఅడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట 
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను  
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు 
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు
ఒక్కసారే తన్నిటి ముద్దు అంతకు మించి వద్దే వద్దు  
వద్దు అబ్బబ్బ వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు
   
చరణం::1
   
ఊరు పేరూ లేని కృష్ణుడు యుగపురుషుడు ఐనాడంటే..ఏఏఏఏ 
ఊరు పేరూ లేని క్కృష్ణుడు యుగపురుషుడు ఐనాడంటే
సత్యభామ తన్నులుగాక సత్యభామ తన్నులుగాక
వేరే కారణ మేముంది...అందుకే         
తన్నుఅయ్యయ్యో తన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను   

చరణం::2

కోకా రైకా లేని గోపికలు ఏటికి అందం తెచ్చారంటే..ఏఏఏఏఏ 
కోకా రైకా లేని గోపికలు ఏటికి అందం తెచ్చారంటే 
అది కృష్టుని చలవే అయినా అది కృష్టుని చలవే అయినా 
ఆపని మళ్ళీ చేశాడా అందుకే
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు 
ఒక్కసారే తన్నిటి ముద్దు అంతకు మించి వద్దే వద్దు 
ఆ..తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
ఆడదాని తన్నుల్లోనే ఆనందం వున్నదంట  
తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
ఆహా..వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు     
మ్మ్ హు..తన్నుతన్నుతన్నుతన్ను మళ్ళీ మళ్ళీ తన్ను 
వద్దు వద్దు వద్దు వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు  

Saturday, March 24, 2012

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4789
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.జానకి,మాధవపెద్ది రమేష్ 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::
ఆహా ఆహా ఆహా ఆహా అహా
లలలలల్లల్లాలలాలలా 
ఒయ్యారాల బంగరు బొమ్మకు వన్నెలు పదహారు 
నేటికి వయసూ పదహారు..ల్లల్లల్లాల్లలాలలాల 
వన్నెలు పదహారు నేటికి వయసూ పదహారు..అ ఆ ఆ ఆ 
ఎందున్నారో ఏమంటారో వచ్చే దొరగారు కాబోయే శ్రీవారు
పుట్టే ఉన్నాము...శపదం పట్టె వున్నాము 
పుట్టే ఉన్నాము...శపదం పట్టె వున్నాము
మొగ్గలు తొడిగిన సిగ్గులు మేమై దగ్గరలోనే వున్నాము 
మొగ్గలు తొడిగిన సిగ్గులు మేమై దగ్గరలోనే వున్నాము   
ఒయ్యారాల బంగరు బొమ్మకు వన్నెలు పదహారు 
నేటికి వయసూ పదహారు..ల్లల్లల్లాల్లలాలలాల 
వన్నెలు పదహారు నేటికి వయసూ పదహారు

చరణం::1

కోరిక పిలిచింది..తెలియక కోమలి పలికింది 
కోరిక పిలిచింది..తెలియక కోమలి పలికింది
అంతటితోనే ఆగకపోతే..అసలుకె మోసం వస్తుంది
ఒయ్యారాల బంగరు బొమ్మకు వన్నెలు పదహారు 
నేటికి వయసూ..పదహారు    

చరణం::2

ఊహలు పూశాయి..మమ్ము ఉక్కిరి చేశాయి..ఆహా  
ఊహలు పూశాయి..మమ్ము ఉక్కిరి చేశాయి..హాహాహా 
అక్కడే వాటిని అణచకపోతే..బిక్కిరి కూడా చెస్తాయి 
అక్కడే వాటిని అణచకపోతే..బిక్కిరి కూడా చెస్తాయి
ఒయ్యారాల బంగరు బొమ్మకు వన్నెలు పదహారు 
నేటికి వయసూ పదహారు..అ ఆ ఆ ఆ ఆ
ఎందున్నారో ఏమంటారో వచ్చే దొరగారు 
కాబోయే శ్రీవారు..ఊ..కాబోయే శ్రీవారు

Tuesday, March 06, 2012

దొరలు దొంగలు--1976



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4784

సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

హేయ్..వెడలె..ఉత్తరాకుమారి సభకు..రాయంటి నడకల
వెడలె..ఉత్తరాకుమారి సభకు
వంది మాగదులు చిందులు తొక్కగ 
వంది మాగదులు చిందులు తొక్కగ
ఆయ్..వంది మాగదులు చిందులు తొక్కగ 
వంది మాగదులు చిందులు తొక్కగ 
కుందర ఘన కను విందుసేయుచు
వెడలె..ఉత్తరాకుమారి సభకు..ఉత్తరాకుమారి సభకు 
రాయంటి నడకల వెడలె..ఉత్తరాకుమారి సభకు
వెడలె..ఉత్తరాకుమారి సభకు..ఆపండీ   
::::
ఇలా ఉత్తరాకుమారి నిద్రనుండి లేచి 
కళ్ళు తేరచి...ఓళ్ళు విరచి
బృహన్నల కడ నేర్చిన...నాట్యవిధానం 
బెట్టిదనినా ఎట్టిదనినా..ఆఆ..శభాష్    
తకిటా..తకతకిట ధిమిత తక తకిటా 
ధిమి తకిట తకిట తోం...తకిటా
తకతకిట ధిమిత తక..తకిటా 
ఉప్పు కప్పురం ఒకటిగ వున్నాఉప్పు 
కప్పురం ఒకటిగ వున్నా ఉప్పు కప్పురం ఒకటిగ వున్నా
రుచుల జాడ వేరన్నాఇది వేదవాక్కు రోరన్నా
తకిటా..ఓహో..తకత కిట ధిమిత తక తకిటా ధిమి తకిట 
తకిట తోం తకిటా తకత కిట ధిమిత తక తకిటా

చరణం::1

కన్ను ముక్కు కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా 
కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా..కన్ను ముక్కు ఒకటిగ ఉన్నా
కాళ్ళ తీరు వేరన్న..ఈ కాళ్ళ కాళ్ళ తీరు వేరన్న 
ఆ కాళ్ళు మాకు...తెలుసన్న 
తకిటా..ఆహా..తకతకిట ధిమిత తక తకిటా ధిమి తకిట 
తకిట తోం తకిటా తకతకిట ధిమిత తక తకిటా..ఆ

చరణం::2

చేతులా ఇవి అయ్యో చేతులా ఇవి ఆ చేతులా ఇవి..అహా 
చేతులా ఇవి భూతలమ్మున ఖ్యాతి గాంచిన రాతి రేకులు 
చూడవే ఓ ముద్దుగుమ్మా చూడవే 
అహ చూడవే ఓ ముద్దుగుమ్మా చూడవే 
చూసితీ నీకంటే ముందే చూసితీ 
ఒహో చూసితీ నీకంటే ముందే చూసితీ
చూసి చేసేదేమి లేదని చూసి చేసేదేమి 
లేదని చూసి చూడని దాననైతిని    
తకిటా తకతకిట ధిమిత తక తకిటా ధిమి తకిట తకిట 
తోం తకిటా తకతకిట ధిమిత తక తదిగినతోం తదిగినతోం

Friday, May 06, 2011

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4783
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి

పల్లవి::

హే...య్యా..హోయ్..హోయ్ 
దొరలెవరో దొంగలెవరో..తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ
ఏ..హేహేహేహే..దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి తేల్చుకుంటానూ..య్య

చరణం::1

హ్హ హ్హుహ్హు..హ్హ హ్హుహ్హు
హ్హ..మనిషి పులిని చంపాడంటే..శౌర్యమంటారూ
పులి మనిషిని చంపిందంటే..క్రౌర్యమంటారూ
ఆ..హహహ..మనిషి పులిని చంపాడంటే శౌర్యమంటారూ
పులి మనిషిని చంపిందంటే..ఏ..క్రౌర్యమంటారూ
ఏమి ధర్మమిది ఏమి న్యాయమిది ..ఎక్కడిదీ సిద్దాంతం
హేయ్..దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ

చరణం::2

ఆ ఆ ఆ హా హా హా..ఆ హా హా హా ఆ  
హ్హ హ్హుహ్హు..హ్హ హ్హుహ్హు
నిప్పులేనిదే పొగరాగదు..ఇది తిరుగులేని నిజమూ
ఎప్పటికైనా నిజం దాగదిది..మరువరాని నిజమూ
ఉప్పు మెక్కితే దాహం తథ్యం..తప్పు చేసితే దండన తథ్యం   
దొరలెవరో దొంగలెవరో..తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ 
హేయ్..తేల్చుకుంటానూ హేయ్..తేల్చుకుంటానూ

Friday, April 01, 2011

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4782
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::
అహ..పెళ్ళి..ఒహో..పెళ్ళి
నీకు పెళ్ళి..నాకు పెళ్ళి
వళ్ళొ పెళ్ళి..గుళ్ళో పెళ్ళి
పెళ్ళీ..ఈ..పెళ్ళీ..ఈ
చల్ మోహనరంగ  
పెళ్ళంటె మాటలు కాదోయి శ్రీరంగశాయి
పెళ్ళి పెళ్ళని గంతులేయ్కోయ్
పెళ్లి అంటే మాటలు కాదోయి శ్రీరంగశాయి
పెళ్ళి పెళ్ళని గంతులేయ్కోయ్

చరణం::1

పిచ్చి కుదరనిదె పెళ్లి జరగదు
పెళ్లి జరగనిదే పిచ్చి కుదరదు 
పిచ్చి కుదరనిదె పెళ్లి జరగదు
పెళ్లి జరగనిదే పిచ్చి కుదరదు
పిచ్చికి పెళ్ళికి పొత్తు కలవదు
కలవక పోతే పెళ్ళే జరగదు 
పెళ్లి అంటే మాటలు కాదోయి శ్రీరంగశాయి
పెళ్ళి పెళ్ళని..గంతులేయ్కోయ్

చరణం::2

ఎండా వానకు పెళ్లంటా
కొండ కిందనే విడిదంటా కొండ కిందనే విడిదంటా
ఎండా వానకు పెళ్లంటా
కొండ కిందనే విడిదంటా కొండ కిందనే విడిదంటా
కోతుల్లార వస్తారా..కొబ్బరికాయలు తెస్తారా 
తేచ్చెదాకా వుంటాను..తేస్తే మాత్రం తంతాను
చల్ మోహనరంగా పెళ్ళంటే మాటలు కాదోయి శ్రీరంగశాయి
పెళ్ళి పెళ్ళని..గంతులేయ్కోయ్
 
చరణం::3

తలుపు తట్టుతావ మురహరె తాళి గట్టుతావా 
తాళి తగలగనె పిల్లలు పుడితే జోలి పట్టుతావ 
హోయ్..తలుపు తట్టుతావ మురహరె తాళి గట్టుతావా 
తాళి తగలగనె పిల్లలు పుడితే జోలి పట్టుతావ
ఉ ళు ళు ళు...జోల పాడుతావా
జో అచ్యుతానంద...జో జో ముకుందా
లాలి పరమానంద...రామ గోవిందా
రామ గోవిందా నీవు గోవిందా నీవు గోవిందా
నేను గోవిందా నీవు నేను గోవిందా గోవిందో గోవిందా

Wednesday, March 16, 2011

దొరలు దొంగలు--1976


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి

పల్లవి::

ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
వెల లేనిది కల కానిది ఇలలోన సరిరానిదీ 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం::1

వెన్నెల పొదిగిన దొన్నెలు కన్నులు 
పెదవుల కందించనా పరవశ మొ౦దించనా
అందం విరిసిన ఆమని వేళా విందులు 
కొదవుండునా వింతలు లేకుండునా
వేడుక వాడుక కాకుండనా 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

చరణం::2

కౌగిట అదిమి హృదయం చిదిమి 
మధువులు కురిపించనా మదనుని మురిపించనా   
అందని స్వర్గం ముందు నిలిచితే 
ఎందుకు పోమ్మ౦దునా ఇది వేళ కాదందునా
తీరిక కోరిక లేదందునా 
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ
వెల లేనిది కల కానిది ఇలలోన సరిరానిదీ
ఏనాడు అనుకోనిదీ ఈనాడు నాదైనదీ

Tuesday, February 08, 2011

దొరలు దొంగలు--1976


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4785
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.జానకి 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
మందార మకరందమూ..ఊ..మందార మకరందమూ 
యెల తేటికె సొంతమూ..ఊ..మందార మకరందమూ
పగడాల నా అధరమూ..ఊ..పగడాల నా అధరమూ
పస గల ప్రతివాడికీ సొంతమూ..ఊ..మందార మకరందమూ..ఊఊఊఊ  

చరణం::1

ముసిరిన విరహం తోలగాలంటే..ముచ్చట నాతో నెరపండి
ముదిమికి పరువం రావాలంటే..ముద్దులు నావే కోసరండి
చెలిమి కోరితిని చెంత చేరితిని..చెలిమి కోరితిని చెంత చేరితిని
వలమికేల రవితేజా..ఆఆఆఆ  
మందార మకరందమూ..ఊ..మందార మకరందమూ..ఊ

చరణం::2

ముసిముసి నగవులు విసిరానంటే..మునులే ముందుకు ఉరకాలి
కసిగొని ఒకచూపు చూశానంటే..ఘనులే దాసులు  కావాలి
మదన సముడవని...హృదయ మొసగితిని
మదన సముడవని...హృదయ మొసగితిని
వదల నింక నిను రాజా..మందార మకరందమూ 
యెల తేటికె సొంతమూ..ఊ..మందార మకరందమూ
పగడాల నా అధరమూ..ఊ..పగడాల నా అధరమూ
పస గల ప్రతివాడికీ సొంతమూ..ఊ..మందార మకరందమూ..ఊ
వదలనురా అదునిదిరా..అదునిదిరా వదలనురా
వదలనురా నిను..వదలనురా వదలనురా

Monday, March 08, 2010

దొరలు దొంగలు--1976

సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ,S.వరలక్ష్మి

పల్లవి::

ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::1

రేవులోని అడుసంతా రూపుమాసీ పోయి౦ది
రేవులోని అడుసంతా రూపుమాసీ పోయి౦ది   
రేయే౦ది పగలే౦ది ఉతకండి జోరుగా
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::2

పట్టు పంచ పంచా౦గం పాపయ్యది
ఈ గళ్ళ కోక పూటకూళ్ళ గౌరమ్మది
పట్టు పంచ పంచా౦గం పాపయ్యది
ఈ గళ్ళ కోక పూటకూళ్ళ గౌరమ్మది
ఈ రెంటికి ఈ రెంటికి ల౦కెర పిచ్చి సన్యాసి
భాదర జతచేసి బండకేసి
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో 
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా

చరణం::3

ఎల్లాయి కుండఫైన ఎన్ని రంగులు
ఏందట్టా సూస్తావు యెర్రి గంగులు
ఎల్లాయి కుండఫైన ఎన్ని రంగులు
ఏందట్టా సూస్తావు యెర్రి గంగులు
ఏటి గాలి కెగిరింది ఫైట సెంగు
ఏటి గాలి కెగిరింది ఫైట సెంగు
బైట పడి కూకుంది వయసు పొంగు
ఓలయ్యొ ఓలమ్మొ..ఓలయ్యొ ఓలమ్మో  
ఈయాల మనకంతా పండగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా
ఏటికీ నీరోచ్చి౦ది ద౦డిగా