Monday, March 05, 2012

స్వయంవరం--1982



సంగీతం::సత్యం  
రచన::రాజశ్రీ  
గానం::S.P.బాలు,P.సుశీల  

పల్లవి::

ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ 
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ 
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ
రారమ్మని పిలిచే పైబడీ 

చరణం::1

పసుపుపచ్చ లోగిలిలో..పసుముకొమ్ము కొట్టినట్టు
నీలిరంగు వాకిలిలో..పసుబార బోసినట్టు
పాదాల పారాణి అద్దినట్టూ..పాదాల పారాణి అద్దినట్టూ 
నుదుటిపై కుంకుమా..దిద్దినట్టూ 
ఆకాశం ఎందుకో..పచ్చబడ్డదీ 
ఆ నడుమ..బొట్టేమో ఎర్రబడ్డదీ 

చరణం::2

పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి..పోసినట్టూ 
ఎర్రనీళ్ళూ దిష్థి తీసి..పోసినట్టూ
కర్పూరం హారతీ..ఇచ్చినట్టూ
ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ
వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ
రారమ్మని పిలిచే..పైబడీ..ఈ 
ఆకాశం ఎందుకో..పచ్చబడ్డదీ
ఆ నడుమ..బొట్టేమో ఎర్రబడ్డదీ

No comments: