Wednesday, March 07, 2012

విజృంభణ--1986









సంగీతం::సత్యం
నిర్మాతలు::కోనేరు రవీంద్రనాథ్,పాలపర్తి కోటేశ్వరరావు
దర్శకత్వం::రాజాచంద్ర
సంస్థ::విజయశ్రీ ఆర్ట్స్
గాత్రం::బాలు, చిత్ర (తొలి పాట)
తారాగణం::శోభన్బాబు, జయసుధ, శోభన, సీత

హిందిలో "Merijung"అనిల్‌కపూర్ హిరోగా
తెలుగులో "విజ్రుంభణ" శోభన్ హిరోగా నటియించిన
ఈ సినిమా పాటలు అన్నీ బాగున్నాయి
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దైర్యంతో
ముందుకు వెళ్ళి విజయం సాధించాలనే నిజాన్ని చెప్పే
పాట ఇది హింది,తెలుగులో రెండింటిలోనూ ఈ పాట చాలా బాగుంటుంది
మీరూ వినండి

పల్లవి:

గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం1:

కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడబడక వడి వడిగా నడిచేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం ప్రతిపదం సమరమై సాగనీ

చరణం2:

చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం
మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం
పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా
ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం

జీవితం ప్రతిపదం సమరమై సాగనీ
గెలుపు మాదే సుమా
గెలుపు మాదే సుమా గగనమే రగిలినా
జీవితం...జీవితం
ప్రతిపదం...ప్రతిపదం సమరమై సాగనీ

No comments: